CSK Retention: ధోనీ కన్నా రవీంద్ర జడేజాకే ఎక్కువ ధర! త్రీడీ ప్లేయర్‌ సాలరీ డబుల్!

IPL 2022 Retention List : CSK Retention Twist | Chennai Super Kings || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 2022 సీజన్‌ మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల విషయంలో అన్ని ఫ్రాంచైజీలు తర్జనభర్జన పడుతున్నాయి. ఎవరిని కొనసాగించాలో.. ఎవరిని వదిలేయాలన్న సమీకరణాల్ని లోతుగా విశ్లేషించుకుంటున్నాయి. రిటెన్షన్ జాబితా సమర్పించేందుకు నేడే(మంగళవారమే) తుది గడువు కావడంతో క్రికెటర్ల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల్లోపు రిటెన్షన్ జాబితాలను అందజేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) డెడ్‌లైన్ విధించింది. రాత్రి 9.30 గంటలకు ఈ రిటెన్షన్ వివరాలను బీసీసీఐ ప్రకటించనుంది. ఈ కార్యక్రమం స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ధోనీ కన్నా జడేజాకే..

ధోనీ కన్నా జడేజాకే..

అయితే ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో పూర్తి వివరాలను వెల్లడించింది. స్వల్ప మార్పులు మినహా ఈ జాబితాలో పెద్దగా తేడాలేమి ఉండవని స్పష్టం చేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకుందని, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కన్నా జడేజాకే భారీ ధరను చెల్లించి మరీ చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంటుందని ఫ్రాంచైజీ వర్గాలు పేర్కొన్నాయి.

రిటెన్షన్ రూల్స్..

రిటెన్షన్ రూల్స్..

బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం పాత ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. అన్ క్యాప్‌డ్ ప్లేయర్స్ ఇద్దరిని మించకూడదు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి.

నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. ఈ రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఆటగాళ్ల నుంచి కొత్త జట్లు 'పిక్ అప్' ఆప్షన్ కింద గరిష్టంగా ముగ్గురిని ఎంచుకోవచ్చు.

జడేజా జీతం డబుల్..

జడేజా జీతం డబుల్..

ఇక నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గా ధోనీని కాకుండా రవీంద్ర జడేజాను ఎంపిక చేసుకుంది. దాంతో అతనికి రూ.16 కోట్ల వేతనం అందనుంది. గత సీజన్‌లో రూ 7 కోట్లు అందుకున్న జడేజా.. ఇప్పుడు ఏకంగా రెండున్నర రెట్లు ఎక్కువగా అందుకుంటున్నాడు. ఇప్పటి వరకు రూ.15 కోట్ల వేతనం అందుకున్న మహీ ఈ సీజన్‌లో సెకండ్ స్లాబ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకున్నందున రూ.12 కోట్లే తీసుకోనున్నాడు. అంటే అతను రూ.3 కోట్లు నష్టపోనున్నాడు. అయితే ధోనీ అంగీకారం మేరకే సీఎస్‌కే ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మూడో స్లాబ్ ప్లేయర్‌గా మోయిన్ అలీ రూ.8 కోట్లు అందుకోనున్నాడు.

ఐపీఎల్ 2021 మినీ వేలంలో మొయిన్ అలీని చెన్నై రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే వచ్చే సీజన్ భారత్‌లో జరగనుండటంతో చెపాక్ స్టేడియం అతనికి సెట్ అవుతుందని రిటైన్ చేసుకుంది. ఇక రుతురాజ్ గైక్వాడ్.. నాలుగో స్లాబ్ ప్లేయర్‌గా రూ.6 కోట్లు అందుకోనున్నాడు. రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై జట్టులోకి వచ్చిన రుతురాజ్.. ఈసారి ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నాడు.

రైనాకు నో చాన్స్..

రైనాకు నో చాన్స్..

ఇక డ్వేన్‌ బ్రావో, ఫాఫ్‌ డు ప్లెసిస్‌, సామ్‌ కరన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, సురేశ్‌ రైనాలను రిలీజ్‌ చేసేందుకు సీఎస్‌కే సిద్దమైంది. ఓపెనర్‌ ఫాఫ్‌ డు ప్లెసిస్‌ 633 పరుగులతో రాణించినప్పటికీ విదేశీ ఆటగాళ్ల కోటాలో ఫ్రాంఛైజీ.. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ వైపే మొగ్గు చూపింది. వేలంలో అతన్ని తీసుకోవాలని భావిస్తోంది. పర్స్ వాల్యూలో మిడిలిన రూ. 48 కోట్లతోనే చెన్నై మిగతా ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, November 30, 2021, 12:33 [IST]
Other articles published on Nov 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X