న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ముందు ధోనీ విధ్వంసం.. 6, 6, 6, 6, 6 (వీడియో)!!

CSK captain MS Dhoni lights up Chepauk ahead of IPL 2020

చెన్నై: ఈనెల 29న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) సీజన్-13 మొదలవనుండగా.. చెన్నై క్రికెట్ అభిమానులను అప్పుడే ఐపీఎల్‌ ఫీవర్‌ పట్టుకుంది. అందుకు కారణం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టడమే. ఈ సీజన్‌ ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ.. సోమవారం నుండి ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. చెన్నై నగరంలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మహీ ప్రాక్టీస్‌ సెషన్‌లలో పాల్గొంటున్నాడు. అంతేకాదు తన హిట్టింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు.

<strong>20 సిక్స్‌లతో హడలెత్తించిన హార్దిక్ పాండ్యా.. టీ20ల్లో రికార్డు బ్యాటింగ్‌!!</strong>20 సిక్స్‌లతో హడలెత్తించిన హార్దిక్ పాండ్యా.. టీ20ల్లో రికార్డు బ్యాటింగ్‌!!

 చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్

చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్

దాదాపు ఎనమిది నెలల తర్వాత ధోనీ బ్యాట్ పట్టి చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత మహీ సన్నాహకానికి దిగడంతో.. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చి తమ అభిమాన క్రికెటర్‌ను చూసి తెగ మురిసిపోతున్నారు. సీజన్-13 కోసం ప్రతి రోజు సురేశ్ రైనాతో కలిసి ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ధోనీ సిక్సర్లు కొట్టడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు

ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు

తాజాగా చిన్నస్వామి స్టేడియంలోని నెట్స్‌లో ధోనీ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ ధోనీ కొట్టిన సిక్సర్ల (6,6,6,6,6) వీడియోని తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ సిక్సర్లు బాదడం చూస్తుంటే.. ఎంత గ్యాప్ వచ్చినా తనలో ఏమాత్రం పవర్ తగ్గలేదని నిరూపితమైంది. కేవలం మూడు రోజుల్లోనే మహీ మునుపటి ఫామ్ అందుకున్నాడు.

రూ.15 కట్లు

రూ.15 కట్లు

ధోనీని రిటైన్ చేసుకున్నందుకుగాను ప్ర‌తీ సీజ‌న్లోనూ అత‌నికి రూ.15 కోట్ల భారీ మొత్తాన్ని చెన్నై చెల్లిస్తోంది. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఇది రెండో అత్య‌ధికం. రూ.17 కోట్ల‌తో విరాట్ కోహ్లీ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. సురేశ్ రైనాకు రూ.11 కోట్ల‌ను చెల్లిస్తోంది. చెన్నై జ‌ట్టులో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న రెండో ప్లేయ‌ర్ రైనానే.

టోర్నీలో తిరుగులేని రికార్డులు

టోర్నీలో తిరుగులేని రికార్డులు

ఐపీఎల్ టోర్నీలో చెన్నైకి తిరుగులేని రికార్డులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మూడు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై.. ఐదు సార్లు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ప‌దేళ్లు ఈ సీజ‌న్‌లో ఆడిన చెన్నై.. ప‌దిసార్లు ఫ్లే ఆఫ్స్‌కు చేరుకుని తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఈ జ‌ట్టును ముందుండి నడిపించడమే ఈ విజయ పరంపరకు అసలు కారణం.

తొలి మ్యాచ్‌లో ముంబైతో చెన్నై ఢీ

2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్ ఓటమి పాలైన తర్వాత ధోనీ మైదానంలో అడుగుపెట్టని విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం ఝార్ఖండ్‌ జట్టుతో కలిసి ఓ వారం సాధన చేసాడు. మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతోంది.

Story first published: Friday, March 6, 2020, 17:32 [IST]
Other articles published on Mar 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X