న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైపై కోల్‌కత్తా విజయం: ధోని ప్రమేయం ఉందన్న కోల్‌కత్తా ఆటగాడు

By Nageswara Rao

కోల్‌కత్తా: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కత్తా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం వెనుక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని ముఖ్య భూమిక పోషించాడట. ఇదెలాగా అని అనుకుంటున్నారా? ధోని ఈ మ్యాచ్‌లో నేరుగా ఆడపోయినా, కోల్‌కత్తా గెలవడానికి తోడ్పడినా సూర్యకుమార్ యాదపై ధోని ప్రభావం ఉందట.

ఐపీఎల్ 8వ ఎడిషన్‌లో భాగంగా బుధవారం నాడు ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 46 పరుగులు సాధించి ముంబైపై కోల్‌కత్తా 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడుసూర్యకుమార్ యాదవ్.

మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గౌతమ్ గంభీర్, ధోని ఇద్దరూ తనకు ఏవిధంగా ప్రేరణ అయ్యారనే విషయాన్ని వివరించాడు. 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ 9 బంతులు మిగిలి ఉండగానే విజయలక్ష్యాన్ని చేధించింది.

CSK captain MS Dhoni 'helps' KKR win IPL 2015 opener against MI

ఆటలో ఒత్తిడిని ఎలా జయించాలో కెప్టెన్ గౌతమ్ గంభీర్, ధోనిలను చూసి తెలుసుకున్నానని అన్నాడు. ఒత్తడిలో కూడా అద్భుతమైన ప్రదర్సన చేయగలిగిన సత్తా ఉన్న ఆటగాడు గంభీర అంటూ కితాబిచ్చాడు. ఐపీఎల్‌లో గత ఏడాది నుంచి గంభీర్ ప్రదర్శనను చూస్తూన్నానని, ఓపెనింగ్ బ్యాటింగ్‌కు దిగిన క్షణం నుంచి ఆట పూర్తయ్యే వరకు తన ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే ఉంటాడన్నాడు.

ఇక ధోని విషయానికి వస్తే ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఎన్నో విజయాలను అందించిన సందర్భాల్లో కూడా కూల్‌గానే ఉంటాడు. వీరిద్దరూ ఎన్ని విజయాలను సాధించినా ప్రశాంతత ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇద్దరూ విభిన్నంగా ఆలోచిస్తారు.

బుధవారం నాడు ముంబై ఇండియన్స్‌పై కోల్‌కత్తాకు వరుసగా పదో విజయం. ఢిపెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ శనివారం (ఏప్రిల్ 11)న బెంగుళూరులో రాయల్ ఛాలెంజర్స్‌తో తలపడనుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X