న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చీఫ్ సెలెక్టరు కాదు, మత ప్రవక్త.. ఇంజామామ్‌పై తీవ్ర హేళన.. విమర్శకుడికి బుద్ధి చెప్పిన నెటిజన్లు!

Critic Tarek Fatah took a cheap shot on selector Inzamam-ul-Haq


పాకిస్థాన్ తీవ్రంగా ద్వేషించే విమర్శకుల్లో తారీఖ్ ఫతే ఒకరు. కెనడాకు చెందిన ఫతే తాజాగా పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్, మాజీ కెప్టెన్ ఇంజామామ్ ఉల్ హక్‌ను టార్గెట్ చేసుకొని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంజీ క్రికెటర్ కంటే ఓ మత ప్రవక్త (ముల్లా)లా కనిపిస్తున్నాడు అని నాసిరకమైన వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. అయితే ఎప్పుడూ పదునైన విమర్శలు చేసే ఫతేకు ఈ సారి నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఇంజిపై వ్యాఖ్యలు చేసిన ఫతేను నెటిజన్లు ఎలా దుయ్యబట్టారంటే..\
 ఇంజమామ్ మత ప్రవక్త మాదిరిగా

ఇంజమామ్ మత ప్రవక్త మాదిరిగా

యుద్ధ వాతావరణం మించి ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు ఆదివారం తెరతీయడంతో ప్రపంచ క్రికెట్‌లో ఉత్కంఠ నెలకొన్నది. మ్యాచ్‌కు ముందు మాజీ కెప్టెన్ సర్ఫ్రాజ్ అహ్మద్ సూచన మేరకు ఇంజమామ్ పిచ్‌ను తనిఖీ చేశాడు. అయితే సంప్రదాయ ముస్తిం వస్త్రధారణతో పిచ్ పరీక్షించడంపై తారీఖ్ ఫతే మండిపడ్డారు. క్రికెటర్ కంటే మత ప్రవక్తలా కనిపిస్తున్నాడంటూ ఫతే విమర్శలు చేశాడు.

13వ ఆటగాడంటూ హేళనగా

ఇంజిపై కామెంట్ చేస్తూ తారీఖ్ ఫతే ఓ ఫొటోను ట్వీట్ చేశారు. సర్ఫాజ్ అహ్మద్, మికీ అర్థర్, ఇంజిమామ్ ఉల్ హక్‌ కలిసి పిచ్‌ను తనిఖీ చేస్తున్న ఫొటోను ట్యాగ్ చేశారు. ప్రపంచ కప్ క్రికెట్‌కు ఓ అరుదైన సంఘటన సాక్ష్యంగా నిలిచింది. భారత్‌తో తలపడే ముందు ఓ మత ప్రవక్తను 13వ ఆటగాడిని రంగంలోకి దించింది. ఇది పాకిస్థాన్‌కు మాత్రమే సాధ్యం అని తారిఖ్ ఫతే ట్వీట్ చేశాడు.

 వివాదాలకు దూరంగా ఉండాలి

వివాదాలకు దూరంగా ఉండాలి

తారిఖ్ ఫతే మీరంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టకు. ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండు. రెండు దేశాలకు క్రికెట్ అంటే మాటల్లో చెప్పలేనంత మక్కువ. ఇంజిమామ్ ఓ దిగ్గజ క్రికెటర్ అటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. పాక్ అంటే ఫతేకు విపరీతమైన విద్వేషం. చిన్న ఆసరా దొరికిన రెచ్చిపోయి కామెంట్లు చేస్తుంటాడు. తాజాగా చేసిన కామెంట్ బెడిసి కొట్టిందనే మాట వినిపిస్తున్నది.

 గట్టిగా బుద్ది చెప్పిన నెటిజన్లు

గట్టిగా బుద్ది చెప్పిన నెటిజన్లు

ఇంజమామ్‌ను మత ప్రవక్త అంటూ సంబోధించడంపై పాక్ అనుకూల నెటిజన్లు గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఇంజి ప్రతిభ ఎంతో చెప్పడానికి ప్రయత్నించారు. ఆయన క్రికెట్‌లో ఓ లెజెండ్ అంటూ కీర్తించారు. ఇంజి అంటే ఏమనుకొంటున్నావు.. క్రికెట్‌లో ఓ లెజెండ్. పాకిస్థాన్ మాజీ కెప్టెన్. ప్రస్తుం ఛీఫ్ సెలెక్టర్ అంటూ ఫతే వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు.

 ఇంజమామ్ ఉల్ హక్ కెరీర్‌ ఇలా

ఇంజమామ్ ఉల్ హక్ కెరీర్‌ ఇలా

ఇంజామామ్ ఉల్ హక్ కెరీర్ విషయానికి వస్తే, పాకిస్థాన్ తరుఫున క్రికెట్ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగులు చేశాడు. పాక్‌ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. 2003 నుంచి 2007 వరకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 1992లో ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించి పాకిస్థాన్‌కు ప్రపంచకప్‌ను అందించిన సమయంలో ఇంజి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు

Story first published: Sunday, June 16, 2019, 10:41 [IST]
Other articles published on Jun 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X