న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంతో గర్వకారణం: చంద్రయాన్-2 సక్సెస్‌పై క్రికెటర్ల ప్రశంసల వర్షం

Crickters Congratulate ISRO scientists for Chandrayaan-2 launch

హైదరాబాద్: అంతరిక్ష రంగంలో భారత్ మరో కలికితు రాయిని చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో చరిత్ర సృష్టించింది. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 43 నిమిషాలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

చంద్రయాన్‌-2 మాడ్యూల్‌కు 48 రోజులు

చంద్రయాన్‌-2 మాడ్యూల్‌కు 48 రోజులు

చంద్రయాన్‌-2 మాడ్యూల్‌కు 48 రోజులు పట్టనుంది. దాని తర్వాత లూనార్ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలో చంద్రయాన్-2 పే లోడ్ సంచరిస్తుంది. అలా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రక్రియ తర్వాత దీర్ఘావృత్తాకారంలో ఉండే లూనార్‌ బౌండ్‌ ఫేస్‌ కక్ష్యలో చంద్రయాన్‌-2 పరిభ్రమించనుంది. ఆ తంతు ముగిశాక అడాప్టర్‌ నుంచి ఆర్బిటర్‌ వేరుపడేలా చేస్తారు.

అపోజీ మోటారును మండించడం ద్వారా

అపోజీ మోటారును మండించడం ద్వారా

అందులోని అపోజీ మోటారును మండించడం ద్వారా.. చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అలా 48వ రోజు చంద్రుడి దక్షిణ ధృవంపైకి ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ను దించుతారు. అనంతరం అందులోని రోవర్‌ బయటకు వచ్చి 500 మీటర్ల పరిధిలో పయనిస్తూ ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రునిపై పరిశోధనలు చేయనుంది.

ఇస్రో విజయవంతంగా

ఇస్రో విజయవంతంగా

ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేయడంతో ఇందుకు సంబంధించిన శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖలు అభినందించారు. భారత క్రికెటర్లు సైతం ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ట్విట్టర్ వేదికగా స్పందించారు.

విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో "చంద్రయాన్-2 విజయవంతం కావడం జాతికి మరో చరిత్రత్మకమైన విజయం.. జైహింద్" అని ట్వీట్ చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో "విజయవంతంగా, సజావుగా చంద్రయాన్-2ని ప్రయోగించిన ఇస్రో బృందానికి అభినందనలు" అంటూ ట్వీట్ చేశాడు.

గౌతమ్ గంభీర్

టీమిండియా మాజీ ఓపెనర్, ఎంపీ గౌతమ్ గంభీర్ తన ట్విట్టర్‌లో "చంద్రుడు ఎలా మాయం అయ్యేవాడో తెలియక చిన్నప్పుడు ఆశ్చర్యపోయేవాడిని. కానీ ఇప్పుడు చంద్రయాన్-2 విజయవంతంగా ప్రయోగించడం ద్వారా తర్వాతి తరాలకు అంతరిక్షానికి సంబంధించి ఎంతో సమాచారం తెలుస్తుంది. ఈ విజయం సాధించిన ఇస్రోకి అభినందనలు" అని ట్వీట్ చేశాడు.

సురేశ్ రైనా

టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా తన ట్విట్టర్‌లో "ఇది చరిత్రాత్మకం. వేల కోట్ల మంది కలను ఆకాశంలోకి పంపారు. భారతదేశానికి ఇది ఎంతో గర్వకారణం" అని ట్వీట్ చేశాడు.

శిఖర్ ధావన్

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన ట్విట్టర్‌లో "ఇది భారతదేశానికి చరిత్రాత్మకమైన సన్నివేశం. చంద్రయాన్-2 ప్రయోగం విజయంవంతంగా చేసిన ఇస్రో బృందానికి అభినందనలు" అంటూ ట్వీట్ చేశాడు.

Story first published: Monday, July 22, 2019, 19:02 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X