న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వరల్డ్‌కప్: ఆ రికార్డు పాట్ కమ్మిన్స్‌దే

Pat Cummins Has Bowled Most Dot Balls So Far. Dot ball percentage with min 60 balls bowled would make a clearer comparison.

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమ్మిన్స్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా పాట్ కమిన్స్ గుర్తింపు పొందాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లాడిన కమిన్స్ 153 డాట్ బాల్స్ వేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిచెల్ స్టార్క్(128 డాట్ బాల్స్), కౌల్టర్ నైల్(113), ట్రెంట్ బౌల్ట్(105), లూకీ పెర్గూసన్(102) ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ జాబితాలా టాప్-3 కూడా ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లే ఉండటం విశేషం. అయితే, టాప్-10లో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం విశేషం. ఆరో స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడ(100), ఏడో స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన జోఫ్రా ఆర్ఛర్(91), ఎనిమిదో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మ్యాట్ హెన్రీ(88)లు ఉన్నారు.

ఇక, తొమ్మిదో స్థానంలో బంగ్లాదేశ్‌కు చెందిన మెహదీ హాసన్(86), పదో స్థానంలో మహ్మద్ ఆమీర్(84) పరుగులతో ఉన్నారు. కాగా, ప్రపంచకప్ టోర్నీలో భాగంగా గురువారం ఇండియా-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగిస్తున్నాడు.

ఉదయం నుంచి నాటింగ్‌హామ్‌లో చిరుజల్లులు కురుస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాటింగ్ హామ్‌లో చిరుజల్లులు కురిశాయి. వర్షం కారణంగా మైదానం మొత్తం తడిసిపోవడంతో సిబ్బింది గ్రౌండ్‌ను ఆరబెడుతున్నారు. దీంతో టాస్ ఆలస్యం కానుంది.

Story first published: Thursday, June 13, 2019, 18:24 [IST]
Other articles published on Jun 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X