న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వ్యూయర్‌షిప్‌లో రికార్డు సృష్టించిన ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్

Cricket World Cup 2019 Opening Match Records Reach of 114 Million Viewership

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్ వ్యూయర్‌షిప్ విషయంలో చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌ని టీవీ 114 మిలియన్ మంది వీక్షించారు. ఈ మేరకు స్టార్ ఇండియా బార్క్ వ్యూయర్‌షిప్ డేటాను విడుదల చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గత ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లతో పోలిస్తే ఇది 2.2 రెట్లు అధికం. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ వన్డే వరల్డ్‌కప్‌ను ప్రసారదారైన స్టార్ ఇండియా ఇంగ్లీషు, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాళీ, మళయాళం బాషల్లో టెలికాస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

2015 వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఆడిన సెమీఫైనల్‌ వరకు పరిగణనలోకి తీసుకుంటే ప్రసారకర్త స్టార్‌ స్పోర్ట్స్‌ లెక్కల ప్రకారం 63.50 కోట్ల మంది భారతీయులు టీవీల్లో వీక్షించారు. ఈసారి వంద కోట్ల మార్కును తాకుతుందని అంచనా వేస్తున్నారు.

మే30న ఆరంభమైన ఈ వరల్డ్ కప్‌ మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది.

ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

1975 నుంచి 1987 మధ్య జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌ల్లో జట్లను గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే, మే30 నుంచి ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. 1992 వరల్డ్‌కప్‌ను ఈ విధంగానే నిర్వహించారు.

ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

Story first published: Wednesday, June 12, 2019, 12:57 [IST]
Other articles published on Jun 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X