న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2022 ఆసియా గేమ్స్‌లో క్రికెట్: కోహ్లీసేన బరిలోకి దిగేనా?

Cricket Will Be Back At The Asiad In 2022 | Oneindia Telugu
Cricket set for Asian Games return in 2022: Reports

హైదరాబాద్: ఆసియా గేమ్స్‌లో మళ్లీ క్రికెట్‌ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. చైనాలోని హాంగ్జౌలో జరిగే 2022 ఆసియా గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా (ఓసీఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌరవ ఉపాధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ తెలిపారు.

వీడియో: అక్కడ మరో బూమ్రా తయారవుతున్నాడుగా: అచ్చం అదే స్టైల్ లో బౌలింగ్వీడియో: అక్కడ మరో బూమ్రా తయారవుతున్నాడుగా: అచ్చం అదే స్టైల్ లో బౌలింగ్

2010 (గ్వాన్‌ఝౌ), 2014 (ఇంచియాన్‌) ఆసియా క్రీడల్లో అలరించిన క్రికెట్‌ను 2018 ఆసియా గేమ్స్ నుంచి తొలగించారు. అయితే అంతర్జాతీయ షెడ్యూల్‌ కారణంగా ఆ రెండు ఆసియా క్రీడల్లో భారత క్రికెట్‌ జట్టు పాల్గొనలేదు. దీంతో ప్రేక్షాకదరణ తగ్గడంతో 2018 ఆసియా గేమ్స్ నుంచి క్రికెట్‌ను తొలగించారు. అయితే ఇంతవరకు ఆసియా గేమ్స్‌లో టీమిండియా పాల్గొనలేదు.

స్వాగతించిన భారత ఒలింపిక్ సంఘం

స్వాగతించిన భారత ఒలింపిక్ సంఘం

క్రికెట్‌ను తిరిగి తీసుకురావాలని ఓసీఏ తీసుకున్న నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్వాగతించింది. అయితే ఏ ఫార్మాట్‌ను ఇందులో కొనసాగిస్తారన్న దానిపై స్పష్టత లేదని ఐవోఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మోహతా చెప్పారు. 2022 ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉంది కాబట్టే క్రికెట్లో భారత్‌ ప్రాతినిథ్యం వహించే విషయం గురించి చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది.

బీసీసీఐ ప్రతినిధి ఇలా

బీసీసీఐ ప్రతినిధి ఇలా

‘‘వచ్చే ఆసియా క్రీడలకు ఇంకా చాలా సమయం ఉంది. అప్పటిలోపు క్రికెట్‌లో భారత్‌ పోటీపడుతుందో లేదో అనే విషయంపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకుంటాం'' అని బీసీసీఐ ప్రతినిధి తెలిపాడు. 2010 క్రీడల క్రికెట్‌లో శ్రీలంక, పాకిస్థాన్‌ వరుసగా పురుషుల, మహిళల విజేతలుగా నిలిచాయి. 2014లో పురుషుల విభాగంలో బంగ్లాదేశ్‌, మహిళల విభాగంలో పాకిస్థాన్‌ స్వర్ణాలు సొంతం చేసుకున్నాయి.

ఆసియా ఒలింపిక్‌ చీఫ్‌గా షేక్‌ అహ్మద్‌

ఆసియా ఒలింపిక్‌ చీఫ్‌గా షేక్‌ అహ్మద్‌

ప్రస్తుత అధ్యక్షుడు షేక్‌ అహ్మద్‌ అల్‌ ఫహాద్‌ అల్‌ సబాకే మళ్లీ ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) పగ్గాలు దక్కాయి. ఆదివారం జరిగిన కమిటీ జనరల్‌ అసెంబ్లీలో కువైట్‌కు చెందిన షేక్‌ అహ్మద్‌ మరో ఐదేళ్ల కాలానికి ఓసీఏ చీఫ్‌గా ఎన్నికయ్యారు. ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న 55 ఏళ్ల షేక్‌ గతేడాది నవంబరులో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ సభ్యుని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, March 4, 2019, 10:00 [IST]
Other articles published on Mar 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X