బీసీసీఐకి ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2021 సెకండాఫ్ టైమ్‌లో టీ20 ట్రై సిరీస్.. ఆ మూడు దేశాల ప్లేయర్స్ దూరం!

IPL 2021 కి అంత సీన్ లేదు Tri-Series ప్లాన్ చేస్తున్న CA, Foreign Players ఎటువైపు ?| Oneindia Telugu

మెల్‌బోర్న్: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌కు విదేశీ ఆటగాళ్లు దూరమవడం ఖామయనిపిస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ విండోలో టోర్నీ నిర్వహిస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసినా.. మిగతా బోర్డులు మాత్రం దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. సరిగ్గా ఐపీఎల్ టైమ్‌లోనే(అక్టోబర్).. వెస్టిండీస్, అఫ్గానిస్థాన్‌తో టీ20 ట్రై సిరీస్‌ను నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) పావులు కదుపుతోంది. ఇది కార్యరూపం దాల్చితే.. ఈ మూడు దేశాల నుంచి మెజారిటీ ప్లేయర్లు ఐపీఎల్‌కు దూరమవుతారు.

 ప్లేయర్లు పెద్దగా పట్టించుకోరు..

ప్లేయర్లు పెద్దగా పట్టించుకోరు..

ఇక ఆస్ట్రేలియా సెలెక్టర్స్ చైర్మన్ ట్రెవర్ హాన్స్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాడు. టీ20 సిరీస్‌కు చాలా మంది టాప్ ప్లేయర్లు అందుబాటులో ఉంటారని, దీని కోసం ఐపీఎల్‌ను కూడా వదులుకుంటారన్నాడు. ‘నేషనల్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడం కంటే మిగతా లీగ్‌ల గురించి ప్లేయర్లు పెద్దగా పట్టించుకోరు. అందుకే మేం టీ20 ట్రై సిరీస్ కోసం ప్లాన్ చేస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో మా ప్లేయర్లందరూ ఈ సిరీస్‌పైనే ఫోకస్ పెడతారు'అని హాన్స్ పేర్కొన్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని బీసీసీఐ అంటోంది. ఫారిన్ ప్లేయర్లు కచ్చితంగా అందుబాటులో ఉంటారనే నమ్మకం ఉందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశాడు. మరోవైపు ఈ సిరీస్‌పై అటు విండీస్, అఫ్గాన్ బోర్డులు కూడా పెద్దగా స్పందించలేదు.

 వార్నర్, కమిన్స్, మ్యాక్స్‌వెల్ దూరం..

వార్నర్, కమిన్స్, మ్యాక్స్‌వెల్ దూరం..

ఆసీస్‌కు చెందిన ఏడుగురు టాప్ క్రికెటర్లు.. వెస్టిండీస్, బంగ్లాదేశ్ టూర్ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో డేవిడ్ వార్నర్, కమిన్స్, మ్యాక్స్‌వెల్, జే రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్‌సన్, మార్కస్ స్టోయినిస్, డానియల్ సామ్స్ ఈ పర్యటనలకు దూరంగా ఉంటున్నట్లు సీఏకు తెలిపారు. మోచేతి గాయం నుంచి కోలుకోని స్టీవ్ స్మిత్ కూడా ఈ టూర్ నుంచి వైదొలిగాడు. టీ20 వరల్డ్‌కప్ ప్రిపరేషన్స్ కోసం సీఏ ఈ రెండు టూర్లను షెడ్యూల్ చేసింది.

 అంత సీన్ లేదు..

అంత సీన్ లేదు..

బీసీసీఐని కాదని ట్రై సిరీస్ నిర్వహించే సాహసం క్రికెట్ ఆస్ట్రేలియాకు లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. పైగా టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీ ముందు ఐపీఎల్ లాంటి మేజర్ టోర్నీ ఆడటానికే ఆటగాళ్లు, ఇతర జట్లు మొగ్గుచూపుతాయంటున్నారు. సీఏ నిర్వహించాలనుకుంటున్నా ట్రై సిరీస్‌‌తో వారికి ఒరిగేదేం ఉండదని, ఐపీఎల్‌తోనే మంచి ప్రాక్టీస్ లభిస్తుందంటున్నారు. బీసీసీఐని కాదని క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చేయలేదని, ముఖ్యంగా అఫ్గాన్, విండీస్ క్రికెట్ బోర్డులు భారత క్రికెట్ బోర్డు మాటను కాదనలేవని స్పష్టం చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య ఐపీఎల్ 2021 సెకండాఫ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, June 17, 2021, 9:46 [IST]
Other articles published on Jun 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X