న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఆడాలా? వద్దా? అనేది ఆటగాళ్ల ఇష్టం: క్రికెట్ ఆస్ట్రేలియా

Cricket Australia leaves it to Australian players to decide on IPL 2020 participation

ముంబై: కరోనా వైరస్ నేపథ్యంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)2020 సీజన్‌ ఆడాలా? లేదా? అని నిర్ణయించుకోవాల్సింది ఆటగాళ్లేనని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. తమ ఫ్రాంచైజీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మార్చి 29న ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుండగా.. కరోనా వైరస్‌ నేపథ్యంలో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

మేం ఏం మాట్లాడలేం..

మేం ఏం మాట్లాడలేం..

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌పై తమ ఆటగాళ్లకు తాము ఎలాంటి సూచనలు ఇవ్వలేమనిక క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. 'ఐపీఎ‌‌ల్‌‌తో క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సంబంధం లేదు. లీగ్‌లో ఆడాలో వద్దో నిర్ణయించుకొనేది వాళ్లే. వారి ఒప్పందాలన్నీ నేరుగా ఫ్రాంచైజీలతోనే ముడిపడ్డాయి. పరిస్థితులను పర్యవేక్షించడం, డీఎఫ్‌ఏటీ సహా మిగతా ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవడం సీఏ పరిధిలోకి వస్తుంది. ఇప్పటికైతే మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేం. ఐపీఎల్‌, ఫ్రాంచైజీల నుంచి మాకెలాంటి సమాచారం లేదు. ఇప్పుడే మేం మాట్లాడటం తొందరపాటు అవుతుంది' అని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.

వీసాలపై ఆంక్షలు..

వీసాలపై ఆంక్షలు..

కరోనా విస్తృతి నేపథ్యంలో వీసాల జారీపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విదేశీ ఆటగాళ్ల వీసాల మంజూరుపై ఏప్రిల్‌ 14 వరకు నిషేధం విధించింది. ఇక రద్దు లేదా వాయిదా వేయడం కుదరని పోటీలను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ మ్యాచులు ప్రేక్షకుల్లేకుండానే జరగవచ్చు.

డెవిడ్ వార్నర్ వీసా రిజెక్ట్..

డెవిడ్ వార్నర్ వీసా రిజెక్ట్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వీసా అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇది టెక్నికల్ సమస్యలతోనా లేక కరోనా నేపథ్యంలోనా అనే విషయం స్పష్టత లేదు. ఇక ఐపీఎల్‌లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లలో ఎక్కువమంది ఆస్ట్రేలియాకు చెందినవారే ఉన్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు డేవిడ్‌ వార్నర్‌ సారథ్యం వహిస్తున్నాడు. మిచెల్‌ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.15.5 కోట్లు వెచ్చించి తీసుకుంది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (పంజాబ్‌), నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ (ముంబయి) సహా 13 మంది ఆసీస్‌ క్రికెటర్లు ఐపీఎల్‌ ఆడాల్సి ఉంది.

ఖాళీ మైదానాలైనా సరే.. ఫారిన్ ప్లేయర్స్ మాత్రం కావాలి..

ఖాళీ మైదానాలైనా సరే.. ఫారిన్ ప్లేయర్స్ మాత్రం కావాలి..

ఇక ప్రేక్షకుల్లేకుండా ఐపీఎల్ నిర్వహించిన తమకు ఓకే కానీ, ఫారిన్ ప్లేయర్స్‌ను మాత్రం అనుమతించాలని ఫ్రాంచైజీలు బోర్డును కోరినట్లు తెలుస్తోంది. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సమక్షంలో శనివారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ భేటికీ ఫ్రాంచైజీలను కూడా ఆహ్వానించారు. ఐపీఎల్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Story first published: Friday, March 13, 2020, 13:29 [IST]
Other articles published on Mar 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X