న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: గుడ్ న్యూస్.. సెకండాఫ్ లీగ్‌ ఆడేందుకు ఆ దేశ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్!

Cricket Australia clears top Australian cricketers to participate in IPL 2021
IPL 2021 : Overseas Players Chooses IPL Over Pak Your || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సెకండాఫ్ ప్రారంభానికి ముంగిట ఫ్రాంచైజీలకు, అభిమానులకు శుభవార్త. టీ20 ప్రపంచకప్ ముందు ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం వారికి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) జారీ చేసింది. కరోనా కారణంగా అర్థంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లను యూఏఈ వేదికగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు లీగ్ జరగుతుందని తెలిపింది. ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుందని పేర్కొంది.

నెలరోజులు మానసిక క్షోభ..

నెలరోజులు మానసిక క్షోభ..

ఇక భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫస్టాఫ్ మ్యాచ్‌ల్లో మొత్తం 40 మంది ఆస్ట్రేలియా ప్లేయర్లు, కోచ్‌లు, బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది, సపోర్ట్ స్టాఫ్ పాల్గొన్నారు. అయితే కరోనా కారణంగా వీళ్లంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షల నేపథ్యంలో మాల్దీవుల్లో సేద తీరారు.

ఆ తర్వాత అక్కడి నుంచి బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో సుమారు నెలరోజుల తర్వాత ఇంటికి చేరారు. దాంతో తీవ్ర మానసిక వేదనకు దూరమైన ఆసీస్ ప్లేయర్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌లు ఆడలేమని కూడా చెప్పారు.

బీసీసీఐనా మజాకా?

బీసీసీఐనా మజాకా?

అంతేకాకుండా అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు ముందుగానే ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆసీస్ ఆటగాళ్లు సెకండాఫ్ లీగ్ ఆడటంపై సందేహాలు రేకెత్తాయి. అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేసిన బీసీసీఐ.. భారత్ వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను సైతం యూఏఈకి తరలించింది. అంతేకాకుండా ఐపీఎల్ 2021 సెకండాఫ్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ప్రారంభమయ్యేలా షెడ్యూల్ చేసింది.

దాంతో ఇతర దేశాలకు ఐపీఎల్ ఆడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే పునరాలోచన చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. మెగా టోర్నీ ముందు ఐపీఎల్ ఆడాల్సిన అవసరాన్ని గుర్తించి తమ ఆటగాళ్లకు ఎన్‌ఓసీ జారీ చేసింది. అఫ్గాన్ క్రికెట్‌ బోర్డుతో మాట్లాడి పరిమిత ఓవర్ల సిరీస్‌ను వాయిదా వేసేలా ఒప్పించింది.

లైన్ క్లియర్..

లైన్ క్లియర్..

దాంతో ఐపీఎల్ 2021 ఫస్టాఫ్ ఆడిన డేవిడ్ వార్నర్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, జై రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్ సన్, రిలే మెరిడిత్, డాన్ క్రిస్టియన్, మొయిస్ హెన్రీక్స్, క్రిస్ లిన్, డానియల్ సామ్స్ మలిదశ మ్యాచ్‌లు ఆడనున్నారు. కేకేఆర్ పేసర్ ప్యాట్ కమిన్స్ తండ్రవ్వడంతో ఐపీఎల్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్ మాత్రం ఆడుతానన్నాడు. కరోనా నేపథ్యంలో టోర్నీ నుంచి తప్పుకున్నా జోష్ హజెల్ వుడ్, , మిచ్ మార్ష్, జాసన్ బెహండ్రాఫ్, ఆడమ్ జంపా, ఆండ్రూ టై, నాథన్ కౌల్టర్ నైల్ సైతం మళ్లీ మెగా లీగ్‌లో పాల్గొననున్నారు.

అటు నుంచే అటే..

అటు నుంచే అటే..

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను సెప్టెంబర్ 14న ముగించనుంది. ఆ వెంటనే దుబాయ్‌కు పయనం కానుంది. బబుల్ టూ బబుల్ ట్రావెల్ చేయడంతో ఆటగాళ్లు మళ్లీ ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)‌ ఆడే ఆటగాళ్లకు కూడా ఈ రూల్ వర్తించనుంది. ఐపీఎల్ సెకండాఫ్ లీగ్‌ సక్సెస్ చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్న బోర్డు ఆ దిశగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇంగ్లండ్ ప్లేయర్లు సైతం లీగ్‌లో పాల్గొననున్నారు.

Story first published: Sunday, August 15, 2021, 16:02 [IST]
Other articles published on Aug 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X