న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 6ixty: వెస్టిండీస్‌లో టీ10 లీగ్.. 6వికెట్లకే ఆలౌట్, మిస్టరీ ఫ్రీహిట్.. పిచ్చెక్కించే కొత్త రూల్స్..!

CPL is going to launch a ‘The 6ixty’ a T10 league with Exciting Rules

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) పదో ఎడిషన్ ఈ సంవత్సరం ఆగస్టు చివర్లో ప్రారంభం కానుంది. అయితే ప్రధాన టోర్నమెంట్‌ (టీ20 ఫార్మాట్లో జరిగే లీగ్)కు ముందు 'ది 6ixty' పేరుతో T10 లీగ్‌ను సీపీఎల్‌లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో టీ10లీగ్ భలే ఆసక్తికరంగా ఉండబోతుంది. ఈ టీ10 టోర్నీలో ఆరు మెన్స్ జట్లు ఆడతాయి. అలాగే 3 వుమెన్స్ జట్లతో కూడా టీ10 టోర్నీ సెపరేట్‌గా నిర్వహించనున్నారు. ఆగస్టు 24నుంచి ఆగస్టు 28వరకు సెయింట్ కిట్స్‌లో టీ10 మ్యాచ్‌లు జరుగుతాయి. తొలిసారి ఒక దేశ బోర్డు (వెస్టిండీస్ బోర్డు) టీ10 లీగ్‌ను ప్రారంభిస్తోంది. టీ10 లీగ్‌లు ఇప్పటికే చాలా చోట్ల జరుగుతున్నప్పటికీ.. అనేక కొత్త రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్‌తో ఈ టీ10 లీగ్‌ను కరేబియన్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు నిర్వహించబోతున్నారు. పేరు సైతం '6ixty' అని చాలా డిఫెరెంట్‌గా పెట్టడం గమనార్హం.

ఇవండీ రూల్స్..

ఇవండీ రూల్స్..

1. ఆరు వికెట్లే: ఒక్కో జట్టుకు పది వికెట్లకు బదులు కేవలం 6వికెట్లు మాత్రమే ఉంటాయి. ఒకవేళ 10ఓవర్లలో 6వికెట్లు పడితే ఆ జట్టు ఆలౌట్ అయినట్లే. అయితే ఫీల్డింగ్ చేసేటప్పుడు మాత్రం బౌలర్‌తో సహా 11మంది ఫీల్డర్లు ఉంటారు.

2. అదనంగా పవర్ ప్లే కావాలంటే: మొదటి రెండు ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది. ఇక తొలి రెండు పవర్‌ప్లేలో బ్యాటింగ్ చేసే జట్టు కనీసం రెండు సిక్సర్లు కొట్టగలిగితే ఫ్లోటింగ్ థర్డ్ పవర్‌ప్లే అన్‌లాక్ చేయబడుతుంది. అంటే మూడో ఓవర్ కూడా పవర్ ప్లే కొనసాగుతుంది.

3. ఒకే ఎండ్ నుంచి 5ఓవర్లు : ఇక బౌలింగ్ జట్టు ప్రతి ఓవర్ తర్వాత ఎండ్‌లు మార్చుకోవడంలో కూడా సడలింపులున్నాయి. ఒకే ఎండ్ నుండి వరుసగా ఐదు ఓవర్ల పాటు బౌలింగ్ చేసేందుకు వీలు కల్పించారు.

4. 45నిమిషాలు దాటితే : ఇక 45 నిమిషాల నిర్ణీత సమయంలో పది ఓవర్లు పూర్తి చేయడంలో బౌలింగ్ జట్టు విఫలమైతే ఇన్నింగ్స్‌లోని చివరి ఆరు బంతులకు గ్రౌండ్లో ఒక ఫీల్డర్‌ను తొలగించాల్సి ఉంటుంది. అంటే 9మంది ఫీల్డర్లే ఉంటారన్న మాట.

5. 'మిస్టరీ-ఫ్రీ హిట్' అనే కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చారు. అభిమానుల ఓటు ద్వారా ఏ ఓవర్ ఏ బంతికి ఫ్రీ హిట్ కావాలనుకుంటున్నారో ఆ బంతికి అంపైర్ ఫ్రీ హిట్ ఇస్తాడు. నోబాల్‌తో సంబంధం లేదు.

 ఇదొక కొత్త ప్రయోగం..

ఇదొక కొత్త ప్రయోగం..

ఇకపోతే ఇదేమైన క్రికెట్ అనుకుంటున్నారా.. గల్లీల్లో కర్రబిళ్ల ఆడుకునే పోరగాళ్ల ఆట అనుకుంటున్నారా అనే డౌట్ కొందరిలో కలగొచ్చు. దీనికి CPL సీఈవో పీట్ రస్సెల్ ESPNcricinfoతో భలే ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. 'ఇది క్రికెట్ కాదని కొందరు విమర్శలు చేయబోతున్నారని మాకు ముందే అర్థమవుతుంది. కానీ నా అభిప్రాయం ఏమిటంటే.. క్రికెట్ అంటేనే మజా. క్రికెట్లో భాగంగా కేవలం ఉత్సాహం, మరియు ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం గోల్ఫ్‌ ఆటలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక మేం క్రికెట్లో ఈ పని చేస్తున్నాం. తద్వారా కొత్తగా ప్రేక్షకులు కూడా వస్తారు. అలాగే ఇప్పటికే క్రికెట్ చూస్తున్న ప్రేక్షకులు మరింత ఎక్సైట్ అవుతారు. మేము ఇప్పుడున్న యూత్‌కు కావాల్సిన రీతిలో ఆటను రూపొందిస్తున్నాం.' అని పేర్కొన్నాడు.

క్రిస్ గేల్ బ్రాండ్ అంబాసిడర్‌గా

క్రిస్ గేల్ బ్రాండ్ అంబాసిడర్‌గా

క్రిస్ గేల్ ఈ టీ10 లీగ్ అయిన 6ixtyకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాడు. ఇక ఈ టోర్నమెంట్లో అంతర్జాతీయ ఆటగాళ్లను కూడా ఆడించనున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్లో మాత్రమే ఈ టోర్నీని నిర్వహిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో వివిధ దేశాల్లో ఈ టోర్నీని నిర్వహించాలని యోచిస్తున్నట్లు సీపీఎల్ సీఈవో పీట్ రస్సెల్ అభిప్రాయపడ్డాడు. అలాగే సంవత్సరానికి నాలుగు సార్లు ఈ టోర్నీని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈసారి ప్రారంభిస్తున్నామని.. మున్ముందు తప్పకుండా వివిధ దేశాల్లో నిర్వహించి తీరుతామని స్పష్టం చేశాడు.

Story first published: Wednesday, June 22, 2022, 21:44 [IST]
Other articles published on Jun 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X