న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైరల్ వీడియో: ఐపీఎల్‌ వచ్చేస్తోంది.. కాస్త బరువు తగ్గించు మిత్రమా!!

CPL 2020: Samuel Badree advises Shimron Hetmyer to drop some weight before IPL 2020

తరోబా (ట్రినిడాడ్‌): ఈ ఏడాది కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌)లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ బోణీ కొట్టింది. బుధవారం సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ జట్టు‌తో జరిగిన మ్యాచ్‌లో రెయాడ్ ఎమ్రిట్‌ నేతృత్వంలోని గయానా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. విండీస్ స్టార్ ఆటగాళ్లు షిమ్రాన్ హెట్‌మైర్ హాఫ్ సెంచరీ (71; 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాది గయానా విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా ఉన్న విండీస్ మాజీ క్రికెటర్ శామ్యూల్ బద్రీ.. హెట్‌మైర్‌కు ఓ కీలక సూచన చేశాడు.

కాస్త బరువు తగ్గించు:

గయానా అమెజాన్‌ వారియర్స్-సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ మ్యాచ్‌లో షిమ్రాన్ హెట్‌మైర్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఫీల్డింగ్ సమయంలో కాలర్ మైక్ ద్వారా హెట్‌మైర్ కామెంటేటర్‌ శామ్యూల్ బద్రీతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ఐపీఎల్ వచ్చేస్తోంది కాబట్టి కాస్త బరువు తగ్గాలంటూ హెట్‌మెయర్‌కి బద్రీ సూచన చేశాడు. అయితే బద్రీ సూచనకు హెట్‌మెయర్‌ నవ్వుతూ బదులిచ్చాడు. దీనికి సంబందించిన వీడియోను సీపీఎల్‌ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'బద్రీ నుండి వార్నింగ్' అని కాప్షన్ పెట్టింది.

సోషల్ మీడియాలో వైరల్:

సోషల్ మీడియాలో వైరల్:

హెట్‌మెయర్‌-బద్రీకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు ఈ వీడియోపై సరదాగా స్పందిస్తున్నారు. ఐపీఎల్ 2020కి ఇక నెల రోజే సమయం ఉంది అని ఓ ఫ్యాన్ కామెంట్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి స్పిన్ కన్సల్‌టెంట్‌గా ప్రస్తుతం బద్రీ ఉన్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత మార్చి నుంచి ఇంటికే పరిమితమైన హెట్‌మెయర్.. కాస్త లావయ్యాడు. అందుకే బద్రీ అలా సరదాగా అన్నాడు.

హెట్‌మైర్‌కు భారీ ధర:

హెట్‌మైర్‌కు భారీ ధర:

ఐపీఎల్‌-2020 కోసం జరిగిన వేలంలో షిమ్రాన్ హెట్‌మైర్‌కు భారీ ధర పలికింది. రూ.7.75 కోట్లకు హెట్‌మెయిర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెట్‌మైర్‌ను వదులుకోగా.. కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడి కోసం ఢిల్లీ, కోల్‌కతా, రాజస్థాన్‌ పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ భారీ ధరతో సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌ తరఫున 16 టెస్టులు, 45 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 838, వన్డేల్లో 1430, టీ20ల్లో 354 పరుగులు చేశాడు.

క్వారంటైన్‌‌లో ఉంచాలా? :

క్వారంటైన్‌‌లో ఉంచాలా? :

కరీబియన్ ప్రీమియర్ లీగ్ సెప్టెంబరు 10న ముగుస్తుంది. ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు జరుగనుంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లు గురువారమే యూఏఈ చేరుకోగా.. ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు శుక్రవారం బయల్దేరనున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు ఈ వారాంతంలో పయనం కానున్నాయి. సీపీఎల్ అనంతరం యూఏఈకి వెస్టిండీస్ క్రికెటర్లు రానున్నారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత వారిని ఆరు రోజుల క్వారంటైన్‌‌లో ఉంచాలా? అనేదానిపై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతుంది.

'ధోనీకి ఐకాన్ హోదా లేదు కానీ స్టార్‌ హోదా ఉంది.. అందుకే ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి'

Story first published: Friday, August 21, 2020, 15:03 [IST]
Other articles published on Aug 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X