న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్సులతో సిమ్మన్స్ వీరవిహారం.. బంతితో చెలరేగిన రాజా.. నైట్ రైడర్స్ సునాయాస విజయం!!

CPL 2020: Lendl Simmons special makes it eight in eight for Trinbago Knight Riders

తారౌబా (ట్రినిడాడ్): వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్నకరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) 2020 క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచుతోంది. బ్యాట్స్‌మన్‌ మాత్రమే కాదు బౌలర్లు చెలరేగుతున్నారు. ప్రతిరోజు ఒకే పిచ్‌పైనే మ్యాచులు జరుగుతుండడంతో తక్కువ స్కోర్లు నమోదవుతున్నా.. బౌలర్లు తమ జట్లకు విజయాలను అందిసున్నారు. బుధవారం బ్రియాన్ లారా మైదానంలో జరిగిన మ్యాచులో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ స్టార్ ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ సిక్సులతో వీరవిహారం చేయగా.. అనంతరం సికిందర్ రాజా బంతితో ఆకట్టుకున్నాడు. దీంతో సెయింట్ కిట్స్ మరియు నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో జరిగిన మ్యాచులో ట్రిన్‌బాగో సునాయాస విజయాన్ని అందుకుంది.

మొదటగా బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ట్రిన్‌బాగోకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ అమీర్ జాంగూ (6) త్వరగానే ఔట్ అయ్యాడు. గాయం కారణంగా కొలిన్ మున్రో (9) మైదానాన్ని వీడాడు. అయితే మరో ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతూ సెయింట్ కిట్స్ బౌలర్లను హడలెత్తించాడు. అతనికి డారెన్ బ్రావో మంచి సహకారం అందించాడు.

సిమ్మన్స్ సిక్సులతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. అధ సెంచరీ అనంతరం సిమ్మన్స్ మరింతగా రెచ్చిపోవడంతో ట్రిన్‌బాగో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే ధాటిగా ఆడే క్రమంలో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ఈ ఓపెనర్ తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. డారెన్ బ్రావోతో 144 భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ భాగస్వామ్యంలో బ్రావో సహకారం 36 మాత్రమే. సెయింట్ కిట్స్ బౌలర్ డొమినిక్ డ్రేక్స్ రెండు వికెట్లు తీశాడు.

లక్ష్య ఛేదనలో సెయింట్ కిట్స్ జట్టు రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ఎవిన్ లూయిస్ (5) వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో జాషువా డా సిల్వా (29), క్రిస్ లిన్ (34) 57 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నించారు. కొద్ది వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ అయ్యారు. ఇదే సమయంలో సికిందర్ రాజా బంతితో మాయ చేశాడు. రాజా దెబ్బకు బెన్ డంక్ (9), దినేష్ రామ్‌దిన్ (4), డొమినిక్ డ్రేక్స్ (7) వరుసగా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత రాయద్ ఎమిరిట్ (13) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ట్రిన్‌బాగో 59 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ట్రిన్‌బాగో 16 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానంలో ఉండగా.. సెయింట్ కిట్స్ రెండు పాయింట్లతో చివరలో ఉంది.

'ఆ కెప్టెన్సీ త్రయం నుంచి ఎన్నో నాయకత్వ పాఠాలు నేర్చుకున్నా.. అవి ఇప్పుడు అమలు చేస్తా''ఆ కెప్టెన్సీ త్రయం నుంచి ఎన్నో నాయకత్వ పాఠాలు నేర్చుకున్నా.. అవి ఇప్పుడు అమలు చేస్తా'

Story first published: Thursday, September 3, 2020, 10:44 [IST]
Other articles published on Sep 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X