న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2020: హెట్‌మైర్ వీరోచిత ఇన్నింగ్.. సెమీస్‌కు గయానా అర్హత!!

CPL 2020: Guyana Amazon Warriors qualify for semis after Shimron Hetmyer heroics

తారౌబా (ట్రినిడాడ్): కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) 2020లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. బుధవారం రాత్రి సెయింట్ లూసియా జూక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గయానా ఏడు వికెట్లతో విజయం సాధించింది. విండీస్ స్టార్ ప్లేయర్ షిమ్రాన్ హెట్‌మైర్ హాఫ్ సెంచరీ (56; 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఐదు విజయాలు అందుకున్న గయానా.. సీపీఎల్ 2020 సెమీఫైనల్లో చోటు ఖరారు చేసుకుంది.

మొదటగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా జూక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేసింది. బ్యాటింగ్ ఆరభించిన సెయింట్ లూసియాకు శుభారంభం దక్కలేదు. గయానా బౌలర్ల ధాటికి 15 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పయింది. ఆండ్రీ ఫ్లెచర్ (1), లెనికో బౌచర్ (1)తలో పరుగుకే ఔట్ అయ్యారు. రకీమ్ కార్న్‌వాల్ మాత్రం రెండు ఫోర్లు, రెండు సిక్సులతో స్కోర్ బోర్డును ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. కవేమ్ హాడ్జ్ (13), నజీబుల్లా (19), నబీ (13), జావెల్లె గ్లెన్ (23) విఫలమయ్యారు. దాంతో సెయింట్ లూసియా 109 పరుగులకే పరిమితమైంది. గయానా బౌలర్లలో నవీన్-ఉల్-హక్, కీమో పాల్ తలో రెండు వికెట్లు తీశారు.

లక్ష్య ఛేదనలో గయానా అమెజాన్‌ వారియర్స్ జట్టుకు కూడా శుభారంభం దక్కలేదు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (5) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో చంద్రపాల్ హేమరాజ్, షిమ్రాన్ హెట్‌మైర్ గయానా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఇద్దరు కలిసి గయానా స్కోర్ బోర్డును 50 పరుగులు దాటించారు. అనంతరం చంద్రపాల్ ఔట్ అయినా.. హెట్‌మైర్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో 56 పరుగులు చేశాడు. పూరన్ (10),టేలర్ (7) అతనికి అండగా నిలిచారు. దీంతో గయానా 13.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

బుధవారం బ్రియాన్ లారా మైదానంలో జరిగిన మరో మ్యాచులో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ స్టార్ ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ (96; 63 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) సిక్సులతో వీరవిహారం చేయగా.. అనంతరం సికిందర్ రాజా (3-15-3)బంతితో ఆకట్టుకున్నాడు. దీంతో సెయింట్ కిట్స్ మరియు నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో జరిగిన మ్యాచులో ట్రిన్‌బాగో సునాయాస విజయాన్ని అందుకుంది. మొదటగా బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సెయింట్ కిట్స్ 115 పరుగులకే పరిమితమైంది.

IPL 2020 schedule: ఐపీఎల్ 2020 షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?IPL 2020 schedule: ఐపీఎల్ 2020 షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Story first published: Thursday, September 3, 2020, 14:09 [IST]
Other articles published on Sep 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X