న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెను ప్రమాదం తప్పింది: బంతి తాకి మైదానంలోనే కుప్పకూలిన ఆండ్రీ రసెల్

CPL 2019: Andre Russell stretchered off, rushed to hospital after he getting hit on head

హైదరాబాద్: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో విండిస్ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సీపీఎల్‌లో భాగంగా ఆండ్రీ రసెల్‌ జమైకా తలవాస్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గురువారం సబీనా పార్క్ వేదికగా సెయింట్‌ లూసియా జౌక్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బంతిని హిట్‌ చేసే క్రమంలో అది రసెల్‌ హెల్మెట్‌ వెనుక భాగాన బలంగా తాకింది.

<strong>ఎమ్మెస్కే వివరణ.. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు రోహిత్‌ను ఎందుకు ఎంపిక చేసామంటే?</strong>ఎమ్మెస్కే వివరణ.. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు రోహిత్‌ను ఎందుకు ఎంపిక చేసామంటే?

మైదానంలోనే కుప్పకూలిన రసెల్

దీంతో ఆండ్రీ రసెల్ మైదానంలోనే కుప్పకూలాడు. ప్రాథమిక చికిత్స తర్వాత రసెల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గురువారం సెయింట్‌ లూసియా జౌక్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 14 ఓవర్‌లో ఈ సంఘఠన చోటు చేసుకుంది. జౌక్స్‌ జట్టు బౌలర్ హర్డుస్ విల్జోయిన్ విసిరిన షార్ట్‌ పిచ్‌ బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించాడు.

కుడి చెవిని బలంగా తాకిన బంతి

కుడి చెవిని బలంగా తాకిన బంతి

అయితే, అది కాస్తా అంచనా తప్పి రసెల్‌ హెల్మెట్‌ను తాకుతూ కుడి చెవిని బలంగా తాకింది. దీంతో రసెల్ మైదానంలో కుప్పకూలాడు. దీంతో సెయింట్‌ లూసియా జౌక్స్‌ ఫీల్డర్లు పరిగెత్తకుంటూ రసెల్‌ వద్దకు వచ్చి హెల్మెట్‌ తీసి అతడిని నెమ్మదిగా పైకి లేపారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మెడికల్ సిబ్బంది అతడికి ప్రాథమికి చికిత్స చేశారు.

ఆసుపత్రికి తరలింపు

అయితే, రెసల్ నడవలేని పరిస్థితిని చూసి స్ట్రెచర్‌పై అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ సీటీ స్కాన్ తీసిన తర్వాత రసెల్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తేల్చారు. ఈ మ్యాచ్‌లో రసెల్‌ గాయపడే సమయానికి మూడు బంతులు ఆడి పరుగులేమీ చేయలేదు. ఈ మ్యాచ్‌లో సెయింట్‌ లూసియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Story first published: Friday, September 13, 2019, 11:33 [IST]
Other articles published on Sep 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X