న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: కరోనా ఎఫెక్ట్.. అభిమానులతో 'నో' సెల్ఫీలు, సంభాషణలు!!

Coronavirus Threat: Likely restrictions on fan interactions, selfies during IND vs SA series

ఢిల్లీ: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సోమవారం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ నుంచి సఫారీ ఆటగాళ్లు నేరుగా తొలి మ్యాచ్‌ వేదిక అయిన ధర్మశాలకు వెళ్లిపోయారు. సఫారీ జట్టు వెంట క్రికెట్‌ సౌతాఫ్రికా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ షుయబ్‌ మన్‌జ్రా కూడా ఉన్నారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్‌-19) భారత్‌లోనూ విస్తరిస్తోండటంతో దక్షిణాఫ్రికా జట్టు తమ వెంట వైద్యుడిని తెచ్చుకుంది.

టెస్టుల్లో ఫలితమే ముఖ్యం.. రోజులు కాదు: మాజీ దిగ్గజంటెస్టుల్లో ఫలితమే ముఖ్యం.. రోజులు కాదు: మాజీ దిగ్గజం

ఆటగాళ్లకు జాగ్రత్తలు:

ఆటగాళ్లకు జాగ్రత్తలు:

కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా భారత్‌తో సిరీస్‌ సమయంలో తమ ఆటగాళ్లెవరూ కరచాలనాలు కూడా చేయరని ప్రొటీస్ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్యం తమ ఆటగాళ్లకు కొన్ని జాగ్రత్తలు సూచించినట్లు కూడా సమాచారం తెలుస్తోంది. జట్టు సభ్యులు ఆరోగ్య నియమాలు పాటించాలని, అంతేకాక అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు, సంభాషణలు చేయకూడదని యాజమాన్యం తెలిపినట్లు సమాచారం.

అభిమానులతో 'నో' సెల్ఫీలు:

అభిమానులతో 'నో' సెల్ఫీలు:

'విదేశాలకు వెళ్లేటప్పుడు ఆటగాళ్లకు ఆరోగ్య జాగ్రత్తలు వివరించాం. అలానే భారత్‌కు వెళ్లేప్పుడు కూడా చెప్పాం. ఇవి ఆటగాళ్లకే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు దిగకూడదని ఇప్పటికే ఆటగాళ్లకు సూచించాం' అని దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్య వర్గాలు తెలిపాయి. ఈ సూచనలు వన్డే సిరీస్‌తో పాటు ఈ నెల 29 నుండి ఆరంభం కానున్న ఐపీఎల్‌లోనూ పాటించాలని తెలిపినట్లు సమాచారం.

ధర్మశాలలో తొలి వన్డే:

ధర్మశాలలో తొలి వన్డే:

దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకోగా.. భారత క్రికెటర్లు మాత్రం మంగళవారం అక్కడికి వెళతారు. అంతకుముందు బోర్డు కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లందరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్, వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత్ ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లఖ్‌నవూ వేదికగా మార్చి 15న రెండో వన్డే, కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో మార్చి 18న ఆఖరి వన్డే ఆడనుంది.

Story first published: Tuesday, March 10, 2020, 10:43 [IST]
Other articles published on Mar 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X