న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా దెబ్బ : ప్రేక్షకుల్లేకుండానే ఐపీఎల్!!

Corona outbreak: IPL 2020 likely to take place behind closed doors

న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బ ప్రపంచం మీద మాములుగా పడలేదు..! ఇప్పటికే ఈ ప్రమాదకర వైరస్ (కొవిడ్-19)‌తో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఆర్థిక, వాణిజ్య పరంగా ఇప్పటికే తీవ్ర నష్టాలు మిగిల్చిన ఈ మహమ్మరి సెగ క్రీడారంగానికి కూడా తగిలింది. పదుల సంఖ్య‌లో టోర్నీలు రద్దయ్యాయి. ఇంకొన్ని జరుగుతాయో లేదో తెలియని గందరగోళం నెలకొంది..

ఇక భారత్‌లోకి చాపకింద నీరులా ఎంటరైనా ఈ మహమ్మారి.. వేగంగా విస్తరిస్తూ ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే 73 కేసులు నమోదవ్వడం.. బుధవారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వైరస్‌ను ప్రాణాంతక వైరస్‌గా ప్రకటించడంతో కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగింది. అన్ని శాఖలకు, రాష్ట్రాలకు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి పాటించాల్సిన గైడ్‌లైన్స్ జారీ చేసింది.

జనసమూహాలు వద్దు.. దేశ ఆరోగ్యం ముఖ్యం..

జనసమూహాలు వద్దు.. దేశ ఆరోగ్యం ముఖ్యం..

ఈ నేపథ్యంలోనే కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజీజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అతని మాటలను బట్టి చూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2020) ప్రేక్షకుల్లేకుండా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

‘కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా జనసమూహాలను తగ్గించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు సూచిస్తున్నారు. అందుకే క్రౌడ్ ఎక్కువగా ఉండే స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ పాటించాలని క్రీడా ఫెడరేషన్స్‌ను కోరుతున్నాం. తాము ఈవెంట్స్ ఆపాలనుకోవడం లేదు. కానీ, జనసమూహాలు ఉండకుండా నిర్వహించుకోవాలని సూచిస్తున్నాం.'అని కిరణ్ రిజీజు తెలిపారు.

ఇక ఐపీఎల్ గురించి ప్రశ్నించగా.. ‘మేం క్రీడలను అడ్డుకోవాలనుకోవడం లేదు. జనసమూహాలు లేకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నాం. అన్నిటికన్నా దేశ ఆరోగ్యం ముఖ్యం.'అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రేక్షకుల్లేకుండా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వరల్డ్‌ సిరీస్‌..

ఇప్పటికే వరల్డ్‌ సిరీస్‌..

మరోవైపు పూణెలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌పై ఆంక్షలు విధించారు. ఈ టోర్నీ 14 నుంచి 20 మధ్య నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌లను ప్రేక్షకుల్లేకుండా నిర్వహించనున్నారు. అలాగే ఇతర వేదికల్లో జరిగే మ్యాచ్‌లు కూడా అవే తేదీల్లో ఈ తరహాలోనే జరుగుతాయి.

14న తుది నిర్ణయం

14న తుది నిర్ణయం

కరోనా ప్రభావంతో ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. రాష్ట్రల అభ్యంతరం, కరోనా, కేంద్ర ప్రభుత్వం వీసాల జారీ నిరాకరణ అంశాలే ప్రధాన ఎజెండగా ఈ భేటీ జరగనుంది. 'ప్రస్తుతం మేం కరోనా వైరస్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాం. శనివారం ఐపీఎల్ పాలక మండలి సభ్యుల సమావేశం జరగనుంది. ఐపీఎల్ 2020పై తుది నిర్ణయం తీసుకుని సమాచారం అందిస్తాం' అని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఈ నెల 29న ముంబైలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్‌ మొదలు కానున్న విషయం తెలిసిందే.

Story first published: Thursday, March 12, 2020, 19:12 [IST]
Other articles published on Mar 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X