న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్ 'ఫోర్' అంచనా: మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడంటూ నెటిజన్ల విమర్శలు (వీడియో)

CONTROVERSY: Twitterati Raise match Fixing Fear After Video Of Rishabh Pant Predicting A Boundary Before Ball Is Bowled Goes Viral

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం ఫిరోజ్ షా కోట్లా వేదికగా కోల్‌ కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడా? అంటే అవుననే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వికెట్ల వెనుక ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూ బిజీగా ఉండే రిషబ్ పంత్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం ఇదే మాదిరి తన నోటికి పనిచెప్పాడు. అయితే ఇప్పుడు అదే అతడు ఫిక్సింగ్ చేశాడా? అన్న అనుమానాలకు తావిస్తున్నది.

అసలేం జరిగింది?

కోల్‌కతా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో పంత్.. బంతి పడే ముందే దాని ఫలితాన్ని అంచనా వేశాడు. యే తో వైసీ భీ చౌకా హై (ఇదెలాగూ ఫోర్ వెళ్తుంది) అని పంత్ అనడం స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డు అయింది. పంత్ అన్నట్లే... ఆ జట్టు స్పిన్నర్ సందీప్ లామిచానె వేసిన ఆ తర్వాతి బంతిని కోల్‌కతా బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్ప బౌండరీకి తరలించాడు.

సోషల్ మీడియాలో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్ ముందుగానే ఫిక్సయింది అనడానికి ఇదే నిదర్శనం అంటూ ఆరోపిస్తున్నారు. పంత్ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయిన వీడియో ఇప్పుడు తొలగించబడింది.

అసలు సిసలైన టీ20 మజా

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు విజయం కోసం చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు తలబడ్డాయి. చివరకు సూపర్‌ ఓవర్‌లో రబాడ అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాను కట్టడి చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయాన్నందించాడు.

సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితం

సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆరు వికెట్ల నష్టానికి అంతే స్కోరు చేయడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కి దారితీసింది. ఈ సూపర్ ఓవర్‌లో ఢిల్లీ 10 పరుగులు చేయగా.. రబాడా కోల్‌కతాను 7 పరుగులకే కట్టడి చేసి ఢిల్లీకి విజయాన్నందించాడు.

Story first published: Sunday, March 31, 2019, 15:32 [IST]
Other articles published on Mar 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X