న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలేం జరిగింది?: మోడీని టార్గెట్ చేసి టామ్ మూడీని ఆడుకున్నారు

By Nageshwara Rao
Comrades mistook Tom Moody for Moody's, shower criticism on cricketer's FB page

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ తాను చేయని తప్పుకు విమర్శలను ఎదుర్కొన్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రధాని నరేంద్ర మోడీ మీద అక్కసుతో కేరళకు చెందిన వామపక్ష నేతలు టామ్ మూడీపై విమర్శలు గుప్పించి ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు.

అసలేం జరిగింది?
ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ 'మూడీస్' 13 ఏళ్ల తర్వాత భారత్‌కు మెరుగైన రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇండియాకు 'బీఏఏ 3' రేటింగ్ ఉండగా.. దాన్ని 'బీఏఏ 2'కు ప్రమోట్ చేసింది. ఈ రేటింగ్ ఇచ్చిన మూడీస్‌ను టామ్ మూడీ అనుకొని కేరళకు చెందిన కొందరు లెఫ్ట్ పార్టీ నేతలు ఆయన్ను విమర్శించారు.

కేరళ ప్రజల నిత్య జీవితంలో భాగమైన కొబ్బరి నూనె ధరలు ఎలా పెరిగాయో తెలుసా? అని టామ్ మూడీ ఫేస్‌బుక్ పేజిలో ప్రశ్నించారు. ఇలా భారత ఆర్థిక వ్యవస్థ రేటింగ్ పెంచినందుకు సిగ్గు పడమంటూ మళయాళంలో తిట్ల దండకం అందుకున్నారు. కొందరైతే.. నీకు దమ్ముంటే కేరళ రా? అని సవాల్ విసిరారు.

అంతేకాదు.. ఆ రేటింగ్‌ పెంపును ఉపసంహరించాలని డిమాండ్‌ చేశాయి. చివరకు ఆ రేటింగ్ ఇచ్చిందని ప్రముఖ రేటింగ్ సంస్ధ మూడీస్ అని తెలియడంతో నాలుక కరుచుకున్నారు. చివరకు తనను క్రికెటర్‌గా గుర్తించినందుకు ఫేస్‌బుక్‌ ద్వారా థ్యాంక్స్‌ చెప్పాడు.

మరికొందరు మలయాళీలు జరిగిన తప్పిదానికి క్షమించమని టామ్ మూడీకి ఫేస్‌బుక్‌లోనే మేసేజ్ పెట్టారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, November 20, 2017, 11:55 [IST]
Other articles published on Nov 20, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X