న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CWG 2022 Cricket Final : బౌలింగ్, ఫీల్డింగ్స్ అదుర్స్ అమ్మాయిలు.. ఇక బ్యాటింగ్లో దంచండి..!

india

బర్మింగ్‌హామ్: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా గోల్డ్ మెడల్ మ్యాచ్ గెలవాలనే కసితో భారత జట్టు ఆడుతోంది. ఇక గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20ఓవర్లలో ఆ జట్టు 8వికెట్లు కోల్పోయి 161పరుగులు చేసింది. తద్వారా ఇండియా ముందు 162పరుగుల టార్గెట్ ఉంచింది. ఇక ఫీల్డింగ్లో భారత జట్టు ప్రదర్శనను ఎంత మెచ్చుకున్నా తక్కువే. రాధాయాదవ్ రనౌట్ మరియు క్యాచ్, అలాడే దీప్తి శర్మ క్యాచ్, పూజా వస్త్రేకర్ బౌండరీల వద్ద సేవింగ్ రన్స్ అద్భుతమనే చెప్పాలి. ఇక భారత బౌలర్లలో స్నేహ రానా 2, రేణుక సింగ్ 2, దీప్తి శర్మ, రాధాయాదవ్ తలా ఓ వికెట్ తీశారు.


ఆదిలోనే ఆసీస్‌కు దెబ్బ
ఇక బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ అలీసా హిలీ (7)ను రేణుక సింగ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపించింది. అయితే కెప్టెన్ మెగ్ లానింగ్ (36పరుగులు 26బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్)తో కలిసి మరో ఓపెనర్ బెత్ మూనీ (61పరుగులు 41బంతుల్లో 8ఫోర్లు) రెండో వికెట్‌కు 74పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. వీరిద్దరు అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. అయితే రాధాయాదవ్ అద్భుత ఫీల్డింగ్ వల్ల మెగ్ లానింగ్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ అయింది.

దీప్తి శర్మ ఒంటి చేతి క్యాచ్‌తో
ఇక తర్వాత క్రీజులోకి దిగిన మెక్ గ్రాత్ (2) రాధాయాదవ్ పట్టిన అద్భుత క్యాచ్‌కు త్వరగానే ఔటయిపోయింది. అలీషా గార్డ్ నర్ (25పరుగులు 15బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) ఉన్నంత సేపు ప్రమాదకరంగా ఆడింది. అయితే తానియా భటియా ఆమెను రెప్పపాటులో స్టంపౌట్ చేసి మళ్లీ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. ఇక బెత్ మూనీ మాత్రం తన హాఫ్ సెంచరీ చేసుకుని హిట్టింగ్ మొదలెట్టింది. అయితే దీప్తి శర్మ పట్టిన ఒంటి చేతి క్యాచ్‌కు ఆమె తన ఇన్నింగ్స్ ముగించక తప్పలేదు. చివర్లో భారత బౌలర్లు పుంజుకోవడంతో రచేల్ హయన్స్ (18పరుగులు 10బంతుల్లో) మినహా మిగతావాళ్లు రాణించలేదు. దీంతో స్కోరు 161పరుగుల వద్ద ముగిసింది.

తుది జట్లు :
భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, తానియా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్
ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): అలిస్సా హీలీ (వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్, రాచెల్ హేన్స్, ఆష్లీ గార్డనర్, గ్రేస్ హారిస్, జెస్ జోనాసెన్, అలానా కింగ్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్

Story first published: Sunday, August 7, 2022, 23:26 [IST]
Other articles published on Aug 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X