న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిక్సింగ్ జరిగిందా?: టీ20ల్లో ఇలా కూడా ఔటవుతారా? (వీడియో)

By Nageshwara Rao
Comical dismissals trigger ICC match-fixing investigation into UAE T20 fixture

హైదరాబాద్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన అజ్మన్ ఆల్‌స్టార్స్ ప్రైవేట్ టీ20 లీగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మండిపడింది. ఈ లీగ్‌లో ఓ జట్టులోని నలుగురు బ్యాట్స్‌మెన్ స్టంపౌట్ అవగా, మరో ఐదుగురు రనౌటయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో ఈ లీగ్‌పై ఐసీసీ విచారణకు ఆదేశించింది. ఈ వీడియో చూస్తే ఎవరికైనా మ్యాచ్ ఫిక్సింగ్ అయిందేమో అన్న అనుమానం కలగక మానదు. కావాలనే బ్యాట్స్‌మెన్ స్టంపౌట్, రనౌటైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. యూఏఈ క్రికెట్ బోర్డు ప్రైవేట్‌గా అనుమతించిన ఈ లీగ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం విశేషం.

దుబాయ్ బుల్స్, షార్జా వారియర్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్స్ 135 పరుగులు చేసింది. అనంతరం 136 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ బుల్స్ బ్యాట్స్‌మెన్ ఇలా స్టంపౌట్, రనౌట్లు కావడంతో 46 పరుగులకే ఆలౌటైంది.

ఈ టోర్నీపై విచారణ జరుగుతున్నట్లు ఐసీసీ యాంటీ కరప్షన్ చీఫ్ అలెక్స్ మార్షల్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ప్రస్తుతం ఆ టీ20 లీగ్‌పై విచారణ ప్రారంభించింది. యూఏఈ నుంచి ఈ టోర్నీకి ఎలాంటి అనుమతి లేదు. ఇప్పటికే మ్యాచ్ అధికారులు, నిర్వాహకులతో మాట్లాడాం. మ్యాచ్‌ ఫిక్యయ్యిందా లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. కానీ.. అజ్మాన్ ఆల్‌స్టార్స్ లీగ్‌ని మాత్రం తాత్కాలికంగా నిషేధించాం' అని అన్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 31, 2018, 14:22 [IST]
Other articles published on Jan 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X