న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒంటి కాలితోనే జట్టును గెలిపించిన కేదార్ జాదవ్

Asia Cup 2018 : Kedar Jadhav Plays Inspite Of His Injury
Comeback man Kedar Jadhav again down with hamstring problem

న్యూ ఢిల్లీ: దుబాయ్ వేదికగా ఆసియా కప్ టోర్నీలో తలపడిన జట్లు కొన్ని పోరాటపటిమ ప్రదర్శించినప్పటికీ ఓటమికి గురికాగా, మరికొన్ని పేలవ ప్రదర్శనతోనే ఇంటి దారిపట్టాయి. టీమిండియా మాత్రం ఓటమి అనేదే లేకుండా టోర్నీని గెలిచింది. ఈ మ్యాచ్‌లో కేదర్ జాదవ్ ప్రదర్శనను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. బంగ్లాదేశ్‌తో శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ అద్భుతమైన పోరాట పటిమని కనబర్చాడు.

తొలి వికెట్‌ను తీసిన కేదర్ జాదవ్

తొలి వికెట్‌ను తీసిన కేదర్ జాదవ్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్ల వరకూ ఒక్క వికెట్ కూడా పడకపోవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. ఆ సమయంలో కేదర్ వేసిన బంతిని షాట్ కొట్టిన మెహదీ హసన్59 బంతుల్లో (32) షాట్ ఆడే ప్రయత్నంలో అంబటి రాయుడు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

 చలించిన కెప్టెన్ .. రిటైర్డ్‌హర్ట్‌గా తప్పుకోమని

చలించిన కెప్టెన్ .. రిటైర్డ్‌హర్ట్‌గా తప్పుకోమని

చేధనకు దిగిన టీమిండియా మ్యాచ్ మధ్యలో పరుగు తీస్తుండగా.. కేదర్ జాదవ్ తొడ కండరాలు పట్టేశాయి. ఈ క్రమంలో నడిచేందుకు చాలా ఇబ్బందిపడిన కేదార్ జాదవ్.. భారత్ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉండటంతో చికిత్స తీసుకుంటూ బ్యాటింగ్‌ని కొనసాగించాడు. సింగిల్స్ తీసే సమయంలో అతని ఒంటికాలి ‘పరుగు' అవస్థ‌ చూసి చలించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కాసేపటి తర్వాత రిటైర్డ్‌హర్ట్‌గా మైదానం వెలుపలికి రావాలని సూచించాడు.

ఒంటి కాలితో పరుగు తీసిన కేదర్ జాదవ్

ఒంటి కాలితో పరుగు తీసిన కేదర్ జాదవ్

అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్‌ని క్రీజులోకి పంపించాడు. కానీ.. జట్టు స్కోరు 212 వద్ద ఆరో వికెట్‌గా రవీంద్ర జడేజా ఔటవడంతో మళ్లీ క్రీజులోకి వెళ్లిన కేదార్ జాదవ్ (23 నాటౌట్: 27 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సు) ఆఖరి ఓవర్‌ వరకూ క్రీజులో నిలిచి చాకచక్యంగా భారత్‌ జట్టుని విజయ పోరాటంలో కీలకంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు.. ఓపెనర్ లిటన్ దాస్ (121) సెంచరీ బాదినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ నిరాశపరచడంతో 48.3 ఓవర్లలో 222 పరుగులకి ఆలౌటైంది.

2016లోనూ బంగ్లాదేశ్‌ని ఫైనల్లో ఓడించిన భారత్

2016లోనూ బంగ్లాదేశ్‌ని ఫైనల్లో ఓడించిన భారత్

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223/7తో విజయాన్ని అందుకుంది. భారత్ గెలుపునకి చివరి ఆరు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన దశలో జాదవ్- కుల్దీప్ జోడి.. తత్తరపాటుకి గురవకుండా వరుసగా 1, 1, 2, 0, 1, 1తో భారత్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తింది. ఆసియా కప్‌ని భారత్‌ గెలవడం ఇది ఏడోసారికాగా.. వరుసగా రెండోసారి. 2016లోనూ ఇలానే బంగ్లాదేశ్‌ని ఫైనల్లో ఓడించి భారత్ విజేతగా నిలిచింది.

Story first published: Saturday, September 29, 2018, 12:29 [IST]
Other articles published on Sep 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X