న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Sri Lanka: ఆ నిర్ణయం ద్రవిడ్‌దే.. ఏకంగా మ్యాచే గెలిచాం: భువనేశ్వర్‌

Coach Rahul Dravid promotes Deepak Chahars batting order in 2nd ODI said Bhuvneshwar Kumar

కొలంబో: టీమిండియా పేసర్ దీపక్‌ చహర్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపించాలన్న నిర్ణయం కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌దే అని భారత వైస్ కెప్టెన్, సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ తెలిపాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో దీపక్‌ ఏడో స్థానానికి న్యాయం చేశాడని ప్రశంసించాడు. మ్యాచ్‌ కఠినంగా సాగడంతో ఒక్కో బంతి ఆడుతూ ముందుకు సాగామని భువీ చెప్పాడు. సాధారణంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో భువీ ముందుగా వస్తాడు. ఈ సారి మాత్రం దీపక్‌ వచ్చాడు. లంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్య ఛేదనలో దీపక్‌ (69 నాటౌట్; 82 బంతుల్లో 7×4, 1×6) అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు. భువనేశ్వర్ (19 నాటౌట్; 28 బంతుల్లో 2×4) అతడికి సహకరించాడు.

<strong>India vs Sri Lanka: ఎమోషనల్ అయిన రాహుల్‌ ద్రవిడ్‌..డ్రస్సింగ్‌ రూమ్‌ నుంచి మైదానంలోకి వచ్చి (వీడియో)</strong>India vs Sri Lanka: ఎమోషనల్ అయిన రాహుల్‌ ద్రవిడ్‌..డ్రస్సింగ్‌ రూమ్‌ నుంచి మైదానంలోకి వచ్చి (వీడియో)

 ఆ నిర్ణయం ద్రవిడ్‌దే:

ఆ నిర్ణయం ద్రవిడ్‌దే:

మ్యాచ్ అనంతరం భారత వైస్ కెప్టెన్ భువనేశ్వర్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ... 'మ్యాచ్ చివరి బంతి వరకు ఆడాలన్నది మా లక్ష్యం. అందుకే సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేశాం. దీపక్‌ చహర్ అద్భుతంగా ఆడాడు. రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌లో భారత్‌-ఏ తరఫున దీపక్ పరుగులు చేశాడు. అతడు భారీ షాట్లు ఆడగలడని ద్రవిడ్‌కు తెలుసు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా పంపించారు. అతడు ఆయన నమ్మకాన్ని నిలబెట్టాడు. దీపక్ బాగా బ్యాటింగ్‌ చేస్తాడని మాకు తెలుసు. ఎందుకంటే రంజీల్లో అతడి బ్యాటింగ్‌ను చూశాం. దీపక్‌ను ముందుగా పంపించడం కఠినమైంది కాకున్నా.. మంచి నిర్ణయమే' అని అన్నాడు.

 ఒక్కో బంతి ఆడుతూ వెళ్లాం:

ఒక్కో బంతి ఆడుతూ వెళ్లాం:

'చివరి వరకు ఆడాలనే మేం పదేపదే మాట్లాడుకున్నాం. ఏ దశలోనూ ఇక మనం గెలిచినట్టే అనుకోలేదు. ఒక్కో బంతి ఆడుతూ వెళ్లాం. దీపక్‌ చహర్ రన్‌ రేట్‌ను 6కు మించి పెరగనివ్వలేదు. రిస్క్‌లేని షాట్లే ఆడాడు. అతడు నకుల్‌ బంతులను బాగా విసరగలడు. ఈ రెండు మ్యాచుల్లోనూ పిచ్‌ బ్యాటింగ్‌కే అనుకూలంగా ఉంది. వాతావరణం కూడా బాగుంది. నా బౌలింగ్‌ ప్రదర్శనపై సంతృప్తికరంగానే ఉన్నా. కోచ్‌ రాహల్ ద్రవిడ్‌ ఎక్కడా ఆందోళన చెందలేదు. ప్రశాంతంగా ఉన్నారు. మేం గెలిచాక అభినందించారు. ఇక హార్దిక్‌ పాండ్యాకు ఫిట్‌నెస్‌ ఇబ్బందులేం లేవు' అని భువనేశ్వర్‌ పేర్కొన్నాడు.

 కుర్రాళ్లకు ఓ గుణపాఠం:

కుర్రాళ్లకు ఓ గుణపాఠం:

జట్టులోని కుర్రాళ్లకు ఈ మ్యాచ్‌ ఒక పాఠమని కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. లక్ష్యం ఛేదించగలమన్న నమ్మకంతో బరిలోకి దిగామని వెల్లడించాడు. 'జట్టులో ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. లక్ష్య ఛేదనలో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. అయితే నెట్స్‌లో దీపక్ చహర్‌ చక్కగా బ్యాటింగ్‌ చేయడం మాకు తెలుసు. మ్యాచు పరిస్థితులపై అతడికి మంచి అవగాహన ఉంది. ఆఖరి నాలుగు ఓవర్లలో వారు లెగ్‌ స్పిన్నర్ల బౌలింగ్‌లో రిస్క్‌ తీసుకోలేదు. లంక ప్లేయర్స్ చక్కగా ప్రణాళికలు అమలు చేశారు. స్పిన్నర్లను ముందే తీసుకొచ్చి ఒత్తిడి చేశారు. వారు శ్రమించినా మేం గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి మ్యాచుల వల్ల కుర్రాళ్లకు అనుభవం వస్తుంది. ఏ పరిస్థితుల్లో ఎలా ఆడాలో నేర్చుకోవచ్చు' అని గబ్బర్ వివరించాడు.

Story first published: Wednesday, July 21, 2021, 13:52 [IST]
Other articles published on Jul 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X