న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆ ఒక్క కారణంగానే.. శాంసన్ కంటే పంత్​కు ఎక్కువ అవకాశాలు'

Coach Biju George said Rishabh Pant gets more chances than Sanju Samson because he is left-handed

ఢిల్లీ: లెఫ్ట్ హ్యాండర్ అన్న ఒకే ఒక్క కారణంగానే భారత జట్టులో వికెట్ కీపర్​గా రిషబ్ పంత్​కు ఎక్కువ అవకాశాలు వచ్చాయని సంజూ శాంసన్ కోచ్​ బిజూ జార్జ్​ అభిప్రాయపడ్డారు. శాంసన్ ప్రతిభ తెలిసిన వ్యక్తిగా, అతడికి మరిన్ని అవకాశాలు దక్కాల్సిందన్నారు. 2015 జింబాబ్వేతో జరిగిన టీ20 ద్వారా భారత జట్టులోకి వచ్చిన శాంసన్​.. మరో అవకాశం కోసం నాలుగేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. గతేడాది బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​కు ఎంపికైనా.. తుది జట్టులో చోటు దక్కలేదు. బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఈ ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగిన రెండు టీ20ల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్ వరుసగా 8, 2 పరుగులు చేశాడు.

గురువారం ఓ ఇంటర్వూలో సంజూ శాంసన్ కోచ్​ బిజూ జార్జ్ మాట్లాడుతూ... 'సంజూ శాంసన్​ను దగ్గరి నుంచి చూస్తున్న వ్యక్తిగా చెబుతున్నా.. టీమిండియా మేనేజ్మెంట్ అతడికి మరిన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సింది. అయితే భారత్ కోణంలో చూస్తే రిషబ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఎందుకు వచ్చాయంటే.. మొదటిడి అతడు లెఫ్ట్ హ్యాండర్​, రెండోది జట్టు వ్యూహాలు. 2019 ప్రపంచకప్​ను దృష్టిలో ఉంచుకొని పంత్​కు టీమిండియా ​మేనేజ్​మెంట్ ఎక్కువ అవకాశాలు ఇచ్చింది' అని అన్నారు. శాంసన్ భారత్ తరపున కేవలం నాలుగు టీ20లు మాత్రమే ఆడాడు. చివరిసారిగా గత మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు.

'లెఫ్ట్ ఆర్మ్​ స్పిన్నర్లు, లెగ్ స్పిన్నర్లు ఉన్న జట్లతో ఆడాల్సి ఉన్నందున లెఫ్ట్ హ్యాండర్ అయిన రిషబ్ పంత్​ ఉంటే బాగుంటుందని అనుకొని ఉంటారు. ఇది నా అభిప్రాయం మాత్రమే. జట్టు అంటే అంతే. కెప్టెన్​, కోచ్ తుది నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థి జట్లకు సరిపోయిన జట్టేదో సెలెక్టర్లు నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఉద్దేశపూర్వకంగా అవకాశాలు ఇవ్వకూడదని మాత్రం ఎవరూ అనుకోరు' అని బిజూ జార్జ్ చెప్పారు. ఇప్పుడు పంత్ విఫలమవుతుండడంతో కేఎల్ రాహుల్​నే వికెట్ కీపర్​గానూ ఉపయోగించుకోవాలని మేనేజ్​మెంట్ భావిస్తోంది.

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల మోత మోగించే సంజు శాంసన్‌కు దురదృష్టవశాత్తు అంతర్జాతీయ క్రికెట్‌లో రావాల్సిన అవకాశాలు రాలేదు. టీమ్ సెలెక్షన్ జరిగిన ప్రతీసారి సంజు వ్యవహారం ఓ హాట్ టాపిక్.. ఇక రాక రాక వచ్చిన అవకాశాల్లో అతను నిరూపించుకోలేకపోయాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినా.. ఇంకా భారత జట్టు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ తరఫు 12 మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. ఓ సెంచరీతో 342 పరుగులు చేశాడు. ఇక ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌ పర్యటనలో రెండు టీ20 మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకున్నా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

ఈసారి బుద్దిగా ఉంటా.. మరో ఛాన్స్‌ ఫ్లీజ్‌: సంజయ్‌ మంజ్రేకర్ఈసారి బుద్దిగా ఉంటా.. మరో ఛాన్స్‌ ఫ్లీజ్‌: సంజయ్‌ మంజ్రేకర్

Story first published: Friday, July 31, 2020, 17:35 [IST]
Other articles published on Jul 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X