న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. కోచ్ సమక్షంలో చర్చలు జరపనున్న పాలకుల కమిటీ

India vs England 2018 : Virat Kohli & Ravisastri were About To Disuss With BCCI | Oneindia Telugu
CoA to meet Virat Kohli, Ravi Shastri; proper communication channel, Australia tour on agenda

న్యూ ఢిల్లీ: భారత జట్టులో రెండు వారాలుగా ఆటగాళ్లు, సెలక్టర్ల మధ్య చెలరేగిన వివాదంపై బీసీసీఐ పాలకుల కమిటీ దృష్టి పెట్టింది. జట్టు నుంచి తమని తొలగించే సమయంలో సెలక్టర్లు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఇటీవల కరుణ్ నాయర్, మురళీ విజయ్‌ స్వయంగా మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. దానికి బదులుగా తాము వారికి సమాచారం ఇచ్చామని గత వారం టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు.

కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి..?

కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి..?

గందరగోళ వాతావరణం నెలకొంది. సెలక్టర్లు, ఆటగాళ్ల మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి..? అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. సెలక్టర్లు.. క్రికెటర్లు చెప్పే విషయంలో ఏ ఒక్కరిదో మాత్రమే నిజం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు అనధికారంగా చెప్పుకొచ్చారు.

 ఆటగాళ్లతో, సెలక్టర్లతో కలిసి చర్చించి

ఆటగాళ్లతో, సెలక్టర్లతో కలిసి చర్చించి

‘సెలక్టర్లు లేదా ఆటగాళ్లు ఎవరో ఒక్కరు మాత్రమే ఇక్కడ నిజం చెప్తున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌ని తొలగించేందుకు బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి చొరవా తీసుకోలేదు. కెప్టెన్ లేదా కోచ్‌తో మాట్లాడటం లేక ఆటగాళ్లతో, సెలక్టర్లతో కలిసి చర్చించి ఉండాల్సింది. అలా చేసి ఉంటే ఇప్పటికే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

పర్యటనకు ముందు వార్మప్ మ్యాచ్‌లు తప్పనిసరి: ద్రవిడ్

కోహ్లి, రవిశాస్త్రి సెలక్టర్లతో మాట్లాడి

కోహ్లి, రవిశాస్త్రి సెలక్టర్లతో మాట్లాడి

వెస్టిండీస్‌తో ఉప్పల్ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న టెస్టు మ్యాచ్‌లో ఆడేందుకు హైదరాబాద్‌కి వచ్చిన టీమిండియాతో బీసీసీఐ పాలకుల కమిటీ బుధవారం సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానెతో పాటు ప్రధాన కోచ్ రవిశాస్త్రి సమక్షంలో సెలక్టర్లతో మాట్లాడి ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌ సమస్యకి ముగింపు పలకాలని పాలకుల కమిటీ యోచిస్తోంది.

ఆటగాళ్ల క్రమశిక్షణ నియమావళి

ఆటగాళ్ల క్రమశిక్షణ నియమావళి

అంతేకాకుండా.. సిరీస్ ముగిసి మూడు నెలలు కాకముందే బీసీసీఐ అనుమతి లేకుండా మీడియా ముందుకి వచ్చి మాట్లాడటం, సెలక్టర్ల తీరుని విమర్శించడం ద్వారా ‘ఆటగాళ్ల క్రమశిక్షణ నియమావళి'ని ఉల్లఘించిన కరుణ్ నాయర్, మురళీ విజయ్‌పై తీసుకునే చర్యలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Story first published: Wednesday, October 10, 2018, 13:17 [IST]
Other articles published on Oct 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X