
పాండ్యా, రాహుల్‌పై జోధ్‌పూర్‌లో కేసు నమోదు
టీమిండియా క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌తో పాటు షో నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్‌కు చెందిన డీఆర్ మెఘవాల్ అనే వ్యక్తి జోద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకున్న జోధ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది?
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోకి ఇటీవల హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి అడగ్గా "నేను ఈ మధ్యకాలంలో మూడు విషయాలను తెలుసుకున్నా. మొదటి విషయం ఏంటంటే.. ఒక అమ్మాయిని చూడటం. రెండోది డేటింగ్. మూడోది రిలేషన్‌షిప్" అని సమాధానమిచ్చాడు.

కండోమ్ ప్యాకెట్ గురించి వివరించి కేఎల్ రాహుల్
మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ వివాదాస్పదంగా చెప్పుకొచ్చాడు. ఈ షో ఇటీవల ప్రసారంకాగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో పాండ్యా ట్విట్టర్‌లో క్షమాపణ కూడా చెప్పాడు. భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడ్డారు. దీంతో వీరిద్దరిపై నిషేధం విధిస్తూ బీసీసీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

నిషేధం ఎత్తివేత
అంతేకాదు వీరిద్దరిని ఆస్ట్రేలియా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించింది. తొలుత బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టాలని భావించినప్పటికీ, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టడంతో వీరిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కోర్టు సహాయకుడిగా మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నర్సింహ బాధ్యతలు చేపట్టడంతో అతనితో చర్చించి వీర్దదరిపై ఉన్న సస్పెన్షన్‌ని సీఓఏ ఎత్తివేసింది.


Click it and Unblock the Notifications












