న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

20 ఏళ్ల రికార్డు బద్దలు: 6.34 సెకన్లలో 60మీటర్ల పరుగు

Christian Coleman runs 60 metres in 6.34 seconds to break 20-year-old record

హైదరాబాద్: ప్రపంచ కాంస్య పతక విజేత క్రిస్టియన్ కాలమ్ మరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. 60మీటర్లు పరుగు పందెంను కేవలం 6.34 సెకండ్లలో దాటి ఔరా అనిపించుకున్నాడు. న్యూ మెక్సికో వేదికగా జరుగుతున్న యూఎస్ ఇండోర్ నేషనల్ ఛాంపియన్‌‌షిప్‌లో పాల్గొని గత రికార్డుని చెరిపేసి దూసుకెళ్లాడు.

20ఏళ్ల క్రితం అమెరికన్ మారిస్ గ్రీన్ 60 మీటర్ల దూరాన్ని కేవలం 6.39 సెకండ్లలో దాటాడు. దీనిని తాజాగా క్రిస్టియన్ ఐదు సెకండ్ల ముందే దాటి పాత రికార్డును చెరిపేశాడు. ఇతను గతేడాది లండన్ వేదికగా జరిగిన 100మీటర్ల పరుగు పందెంలో కాంస్యాన్ని గెలుచుకున్నాడు.

వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లోని బిర్మింగమ్ వేదికగా జరగనున్న ఐఏఏఎఫ్ వరల్డ్ ఇండోర్ ఛాంపియన్‌షిప్‌లో అమెరికా జట్టును లీడ్ చేయబోతున్నాడు. ప్రస్తుత ప్రదర్శనతో అతను తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. గతేడాది ఈ రికార్డు 6.37 సెకన్లలో పూర్తి కాగా, ఈ ఏడాది ఇంకో రెండు సెకన్ల ముందే అది పూర్తయింది.

దురదృష్టవశాత్తు గత రికార్డులు పరిగణనలోకి తీసుకోలేదు. 'నా ప్రతిభను మెరుగు పరచుకునేందుకు తొలినాళ్ల నుంచి ఇదే స్థాయిలో కష్టపడుతున్నా' అని క్రిస్టియన్ కాలమ్ అన్నాడు.

Story first published: Tuesday, February 20, 2018, 12:44 [IST]
Other articles published on Feb 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X