న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ్యారీ కిర్‌స్టన్‌కు మరోసారి నిరాశే.. ఇంగ్లండ్‌ హెడ్ కోచ్‌గా క్రిస్‌ సిల్వర్‌వుడ్‌

Chris Silverwood named Trevor Bayliss replacement as England head coach

లండన్‌: ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు హెడ్ కోచ్‌గా క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ నియమితులయ్యారు. కోచ్ రేసులో హేమాహేమీలు ఉన్నా.. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్న క్రిస్ సిల్వర్‌వుడ్‌ వైపే ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మొగ్గుచూపింది. తుది జాబితాలో మాజీ కోచ్‌, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టన్‌ పేరున్నప్పటికీ సిల్వర్‌వుడ్‌ను నియమించడాకే ఈసీబీ మొగ్గుచూపింది. హెడ్ కోచ్‌గా 44 ఏళ్ల క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ ఎంపికయినట్టు ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గైల్స్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బెయిలీస్‌ స్థానంలో సిల్వర్‌వుడ్‌ భాద్యతలు చేపట్టనున్నాడు.

ఉగ్రవాదుల చేతిలో కీలుబొమ్మగా మారాడు.. పాకిస్థాన్‌ ప్రధానిపై మహమ్మద్‌ కైఫ్ ఫైర్ఉగ్రవాదుల చేతిలో కీలుబొమ్మగా మారాడు.. పాకిస్థాన్‌ ప్రధానిపై మహమ్మద్‌ కైఫ్ ఫైర్

కిర్‌స్టన్‌కు మరోసారి నిరాశే:

కిర్‌స్టన్‌కు మరోసారి నిరాశే:

హెడ్ కోచ్‌గా క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ ఎంపికవడంతో.. గ్యారీ కిర్‌స్టన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇటీవల భారత జట్టు హెడ్ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకుని భంగపడ్డ కిర్‌స్టన్‌.. ఇంగ్లండ్‌ కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ చుక్కెదురైంది. ఈ మధ్య కాలంలో కిర్‌స్టన్‌కు ఏది కలిసిరావడం లేదు. ఒకసారి రవిశాస్త్రి అడ్డుపడగా.. మరోసారి సిల్వర్‌వుడ్‌ అడ్డుతగిలాడు. అయితే గతంలో భారత మహిళల జట్టుకు అవకాశం వచ్చినా.. కిర్‌స్టన్‌ ఉపయోగించుకోలేదు.

కిర్‌స్టన్‌కే మాజీల ఓటు:

కిర్‌స్టన్‌కే మాజీల ఓటు:

ఇంగ్లండ్‌కు కోచ్‌గా పని చేసిన ట్రెవర్ బెయిలీస్‌ పదవీ కాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఈసీబీ కోచ్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పదవి కోసం సిల్వర్‌వుడ్‌, కిర్‌స్టన్‌, అలెక్‌ స్టువార్ట్‌, గ్రాహమ్‌ ఫోర్డ్‌లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పలువురు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్లు కిర్‌స్టన్‌ నియమానికే ఓటేసారు. గ్యారీ కిర్‌స్టన్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని బ్రిటిష్ మీడియా గత వారం వార్తలు కూడా ప్రచురించింది.

రేసులో ముందందజలో నిలిచినా:

రేసులో ముందందజలో నిలిచినా:

ఇంటర్యూలు నిర్వహించిన అనంతరం ఇంగ్లండ్‌ క్రికెట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సమక్షంలోని ఈసీబీ సెలక్షన్‌ ప్యానల్‌ మాత్రం సిల్వర్‌వుడ్‌ పేరును ఖరారు చేసింది. దీంతో గతంలో హెడ్‌ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న కిర్‌స్టన్‌.. రేసులో ముందందజలో నిలిచినా ప్రతికూల ఫలితమే వచ్చింది. ఇంటర్యూలో కిర్‌స్టన్‌ కంటే సిల్వర్‌వుడ్‌ చెప్పిన సమాధానాలకే ఈసీబీ సంతృప్తి చెందిందట. స్వదేశీ క్రికెటర్‌ కావడం కూడా సిల్వర్‌వుడ్‌కు కలిసొచ్చింది. ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా సేవలందించడం కూడా అతనికి ఉపయోగపడింది.

Story first published: Monday, October 7, 2019, 16:34 [IST]
Other articles published on Oct 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X