న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ బంతితో ఫుట్‌బాల్‌ ఆడాడు.. వికెట్‌ తీశాడు (వీడియో)!!

Chris Morris Exhibits Elite Footwork To Run Out Batsman In BBL match

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచుతుంది. లీగ్‌లో ఇప్పటికే ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించగా.. అఫ్గాన్ స్పిన్నర్‌ అహ్మద్‌ వినూత్న సంబరాలతో అబిమానులను అలరించాడు. ఇక ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ ఓ స్టన్నింగ్‌ క్యాచ్‌తో హాట్‌టాపిక్‌ అయ్యాడు. ఆస్ట్రేలియా హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ లిన్‌ కూడా తన ప్రతాపం చూపించాడు. తాజాగా దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ ఫీల్డింగ్‌లో అద్భుతం చేసాడు. ఫుట్‌బాల్ తరహాలో బంతిని తన్ని బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేశాడు.

<strong>చాహల్‌ టీవీలో ఇంటర్వ్యూ.. పంత్‌ను ట్రోల్‌ చేసిన ధావన్‌!!</strong>చాహల్‌ టీవీలో ఇంటర్వ్యూ.. పంత్‌ను ట్రోల్‌ చేసిన ధావన్‌!!

మోరిస్‌ ఫీల్డింగ్‌ విన్యాసం

మోరిస్‌ ఫీల్డింగ్‌ విన్యాసం

లీగ్‌లో భాగంగా శనివారం సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సిక్సర్స్‌ జట్టు బ్యాటింగ్‌ ఆరంభించగా.. థండర్స్‌ జట్టు క్రిస్‌ మోరిస్‌కు బంతిని ఇచ్చింది. ఆ ఓవర్‌ ఐదో బంతికి ఓపెనర్‌ డానియల్‌ హ్యూస్‌ బంతిని డిఫెన్స్‌ ఆడి పరుగు తీయడానికి యత్నించాడు. బౌలింగ్‌ ఎండ్‌ నుంచి పరుగెత్తుకొంటూ వచ్చిన మోరిస్‌.. బంతిని వికెట్లవైపు కాలితో తన్నాడు. ఫుట్‌బాల్‌ తరహాలో తన్నిన ఆ బంతి కాస్తా నెమ్మదిగా వెళ్లి వికెట్లకు గిరాటేసింది. ఆ సమయంలో డానియల్‌ క్రీజ్‌లో చేరుకోలేకపోవడంతో రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు.

మీడియాలో వైరల్

మీడియాలో వైరల్

దీనికి సంబంధించి వీడియోను బీబీఎల్‌ తన అధికారిక ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఆర్సీబీ ఆటగాడు మోరిస్‌ వైవిధ్యం బయటకు తెలిసింది. ఈ రనౌట్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు వీడియోను షేర్ చేస్తూ.. తెగ లీకులు కొడుతున్నారు. 'మోరిస్‌ ఫుట్‌బాల్‌ ఆడు ఇగ' అని ఓ అభిమాని ట్వీట్ చేసాడు. 'నువ్ ఫుట్‌బాల్‌ ఆడితే.. గోల్స్ పండగ జరుగుతుంది' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

76 పరుగులకే సిక్సర్స్‌ అలౌట్

76 పరుగులకే సిక్సర్స్‌ అలౌట్

ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌ 15.5 ఓవర్లలో 76 పరుగులకు ఆలౌటైంది. 26 పరుగులకే ఆరు వికెట్లు నష్టపోయి సిక్సర్స్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బెన్‌ డ్వార్షిస్‌, జస్టిన్‌ అవెన్‌డానో బాధ్యతాయుతంగా ఆడి ఏడో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దీంతో సిక్సర్స్‌ 76 పరుగులు చేసింది.

4 పరుగుల తేడాతో థండర్స్‌ విజయం

లక్ష్య ఛేదనలో సిడ్నీ థండర్స్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన కాసేపటికి వర్షం పడింది. థండర్స్‌ 5.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగుల వద్ద ఉండగా వరణుడు అడ్డుపడ్డాడు. భారీ వర్షం పడడంతో మ్యాచ్ రద్దయింది. దాంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం థండర్స్‌ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. రెండు వికెట్లు తీసిన మోరిస్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు. గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో బెంగళూరు జట్టు మోరిస్‌ను రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Story first published: Sunday, January 19, 2020, 10:48 [IST]
Other articles published on Jan 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X