న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిస్ లిన్ సిక్సర్ల వర్షం.. 35 బంతుల్లో 94.. ఇక ముంబైకి పండగే!!

Chris Lynn Smashes Sixer-Filled 95 for Brisbane Heat in Big Bash League

సిడ్నీ: ఇటీవలే ప్రారంభం అయిన బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచుతుంది. లీగ్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించగా.. అఫ్గాన్ స్పిన్నర్‌ అహ్మద్‌ వినూత్న సంబరాలతో అబిమానులను అలరించాడు. ఇక ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ ఓ స్టన్నింగ్‌ క్యాచ్‌తో హాట్‌టాపిక్‌ అయ్యాడు. తాజాగా ఆస్ట్రేలియా హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ లిన్‌ కూడా తన ప్రతాపం చూపించాడు.

<strong>ఐపీఎల్‌ నుంచి ప్రవీణ్‌ తాంబే ఔట్.. కారణం అదేనా?!!</strong>ఐపీఎల్‌ నుంచి ప్రవీణ్‌ తాంబే ఔట్.. కారణం అదేనా?!!

లిన్ మెరుపులు

లిన్ మెరుపులు

లీగ్‌లో భాగంగా ఆదివారం బ్రిస్బెన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదటగా బ్యాటంగ్ చేసిన బ్రిస్బెన్ హీట్ రెండో ఓవర్లో 6 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో క్రిస్‌ లిన్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. వచ్చిరావడంతోనే సిడ్నీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 35 బంతుల్లో 94 (4 ఫోర్లు, 11 సిక్సర్లు) పరుగులు చేసాడు. లిన్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 సిక్సర్లు ఉండడం విశేషం.

48 పరుగుల తేడాతో విజయం

48 పరుగుల తేడాతో విజయం

లిన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో.. బ్రిస్బెన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాట్ రెన్షా (60) హాఫ్ సెంచరీ చేసాడు. అనంతరం లక్ష్య ఛేదనలో సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులకే పరిమితమైంది. దీంతో బ్రిస్బెన్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. జేమ్స్ విన్స్ (39) టాప్ స్కోరర్. బ్రిస్బెన్ బౌలర్లు అందరూ రాణించారు.

ముంబైకి పండగే

ముంబైకి పండగే

లిన్‌ బాదుడు వీడియోను బీబీఎల్ తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు 'ముంబైకి పండగే' అని అంటున్నారు. ఐపీఎల్-2020 ఆటగాళ్ల వేలంలో లిన్‌ కనీస ధరకే అమ్ముడుపోయాడు. కనీస ధర రూ. 2 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కైవసం చేసుకుంది.

టీ10 లీగ్‌లో రికార్డు

క్రిస్‌ లిన్‌ (రూ. 9.6 కోట్లు)కు అత్యధిక మొత్తం చెల్లించి రావడంతోనే అతన్ని కేకేఆర్‌ వదిలేసుకుంది. క్రిస్‌ లిన్‌ను కనుగోలు చేసేందుకు ముంబై తప్ప మిగతా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. అబుదాబి టీ10 లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు లిన్‌ తాజాగా తన పేరున రాసుకున్నాడు. కేకేఆర్‌ వదిలేసిన రోజుల వ్యవధిలోనే ఈ రికార్డును లిన్‌ సాధించడం విశేషం.

Story first published: Monday, December 23, 2019, 9:10 [IST]
Other articles published on Dec 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X