న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్ దిగ్గజం లారా రికార్డులు బద్దలు కొట్టిన క్రిస్ గేల్‌

Chris Gayle surpasses Brian Lara to become highest ODI run-getter for West Indies in 300th appearance

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్‌తో క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్‌ వెటరన్ బ్యాట్స్‌మన్, డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్‌ రెండు రికార్డులు అందుకున్నాడు. భారత్‌తో జరిగిన రెండో వన్డే గేల్‌ కెరీర్‌లో 300వ వన్డే. వెస్టిండీస్‌ తరఫున 300 వన్డేలు ఆడిన తొలి ఆటగాడిగా గేల్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో మాజీ దిగ్గజం బ్రయాన్‌ లారా (299) రెండో స్థానంలో ఉన్నాడు.

<strong>వన్డేల్లో అత్యధిక పరుగులు.. గంగూలీని అధిగమించిన కోహ్లీ</strong>వన్డేల్లో అత్యధిక పరుగులు.. గంగూలీని అధిగమించిన కోహ్లీ

తొలి వెస్టిండీస్‌ ఆటగాడు:

వెస్టిండీస్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గానూ గేల్‌ (10,408) రికార్డు నెలకొల్పాడు. రెండో వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లారా (10,405)ను గేల్‌ అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు గేల్‌ 10,397 పరుగులతో ఉన్నాడు. రెండు బ్రయాన్‌ లారా రికార్డులే బద్దలు కొట్టడం విశేషం. ఈ మ్యాచ్‌లో గేల్‌ (11; 24బంతుల్లో 1×4) తన ప్రభావం చూపలేకపోయాడు. భారత బౌలర్లను ఎదుర్కొలేక పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. తడబడుతూ చివరకు 10వ ఓవర్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

గేల్‌కు నిరాశ:

మొదతో వన్డేలో కూడా గేల్‌ (4; 34బంతుల్లో) విఫలమయిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌ తర్వాత భారత్‌తో టెస్టుల్లోనూ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని ఆశించిన గేల్‌కు నిరాశ ఎదురైంది. సెలక్టర్లు అతడికి టెస్టు జట్టులో అవకాశమివ్వలేదు. దీంతో ఇంకో ఒక్క వన్డేతో గేల్‌ కెరీర్‌ ముగియనుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది. మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.

59 పరుగుల తేడాతో ఓటమి:

59 పరుగుల తేడాతో ఓటమి:

ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు. టార్గెట్ ఛేజింగ్‌కు దిగిన విండీస్ భారత బౌలర్ల ధాటికి 42 ఓవర్లలో 210 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్‌ లూయిస్‌ (65; 80బంతుల్లో 8×4, 1×6), నికోలస్ పూరన్‌ (42; 52బంతుల్లో 4×4, 1×6)లు రాణించారు. భువనేశ్వర్‌ కుమార్‌ (4/31) చెలరేగాడు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (120; 125 బంతుల్లో 14×4, 1×6) సెంచరీ చేసాడు.

1
46247
Story first published: Monday, August 12, 2019, 11:10 [IST]
Other articles published on Aug 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X