న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ది హండ్రెడ్‌' టోర్నీలో హేమాహేమీలు: అత్యధిక ధర జాబితాలో గేల్, స్మిత్

 Chris Gayle, Steve Smith among most expensive players in The Hundred draft

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'ది హండ్రెడ్‌' టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లతో విండిస్ బ్యాటింగ్ దిగ్గజం క్రిస్ గేల్‌లు అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. 'ది హండ్రెడ్‌' టోర్నలో భాగంగా ప్రతి జట్టు 100 బంతులను ఆడాల్సి ఉంటుంది.

'ది హండ్రెడ్‌' టోర్నమెంట్‌లో ఆడేందుకు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పోటీ పడుతుండటం విశేషం. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, విండిస్ ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ లాంటి క్రికెటర్లు అత్యధిక ధరతో లీగ్‌లో వేలానికి సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను ఆదివారం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది.

నేటికి 41 ఏళ్లు: కపిల్ దేవ్‌కు ఈరోజు ఎంతో ప్రత్యేకమంటూ ఐసీసీ ట్వీట్!నేటికి 41 ఏళ్లు: కపిల్ దేవ్‌కు ఈరోజు ఎంతో ప్రత్యేకమంటూ ఐసీసీ ట్వీట్!

మొత్త 331 మంది స్వదేశీ ఆటగాళ్లు, 239 విదేశీ ఆటగాళ్లు డ్రాప్ట్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ 159,400 డాలర్ల రిజర్వ్‌ ధరతో వేలంలో అందుబాటులో ఉన్నాడని ఈసీబీ పేర్కొంది. ఈ 100 బంతుల టోర్నీలో శ్రీలంక పేసర్ లసిత్‌ మలింగతో పాటు సఫారీ పేసర్ కగిసో రబాడ కూడా పాల్గొనబోతున్నాడు.

అమిత్ షా గురి... ఆపరేషన్ బెంగాల్?: BCCI అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక వెనుక బీజేపీ పెద్దల హస్తం!అమిత్ షా గురి... ఆపరేషన్ బెంగాల్?: BCCI అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక వెనుక బీజేపీ పెద్దల హస్తం!

ఈ మేరకు వీరంతా తమ పేర్లను డ్రాప్ట్‌లో నమోదు చేసుకున్నారు. వచ్చే ఏడాది జులై-ఆగస్టు మధ్య ఈ టోర్నీని నిర్వహించేందుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్ల వివరాలు ఉన్నాయి. లండన్‌ నుంచి రెండు జట్లు, బర్మింగ్‌హామ్‌, మాంచెస్టర్‌, లీడ్స్‌, నాటింగ్‌హామ్‌, కార్డిఫ్‌, సౌతాంప్టన్‌.

Story first published: Wednesday, October 16, 2019, 14:22 [IST]
Other articles published on Oct 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X