న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇప్ప‌ట్లో రిటైర్ కాను.. ఇంకో అయిదేళ్లు ఆడతా: గేల్‌

Chris Gayle said I will play Cricket five more years

దుబాయ్‌: వెస్టిండీస్‌ దిగ్గజం, యూనివ‌ర్స్ బాస్ 'క్రిస్‌ గేల్‌ రిటైర్మెంట్‌ ఎప్పుడూ?' అని చాలా కాలంగా వినిపిస్తున్న ప్రశ్న. అయితే గేల్‌ మాత్రం ఇంకొన్నేళ్లు తననేం అడగొద్దని అంటున్నాడు. 41 ఏళ్ల వ‌య‌సులో రిటైర్మెంట్ ఆలోచ‌న‌లు లేవ‌ని, 45 ఏళ్ల‌కు ముందు రిటైర్ అయ్యే ప్ర‌స‌క్తే లేద‌ని గేల్ స్పష్టం చేశాడు. ఇంకో రెండు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు ఆడ‌తాన‌ని తేల్చి చెప్పాడు. వ‌య‌సు కేవ‌లం ఒక నంబ‌రే అని కొట్టి పారేస్తున్నాడు.

తాజాగా క్రిస్‌ గేల్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'ఇంకా అయిదేళ్ల పాటు క్రికెట్‌ ఆడే సత్తా నాలో ఉంది. వాస్తవానికి 45 ఏళ్ల వరకు రిటైర్మెంట్‌ ఆలోచనే చేయను. ఇంకో రెండు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు ఆడ‌తా. వ‌య‌సు కేవ‌లం ఒక నంబ‌రే. పరుగులు చేస్తున్నామా? లేదా? అనేదే ముఖ్యం' అని చెప్పాడు. అల్టిమేట్ క్రికెట్ చాలెంజ్ (యూకేసీ) టోర్నీలో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడాడు. యూకేసీ టోర్నీ కొత్త‌గా, ఆస‌క్తిగా ఉన్న‌ద‌ని గేల్ అన్నాడు.

ప్రస్తుతం క్రిస్‌ గేల్‌ దుబాయ్‌లో అల్టిమేట్‌ క్రికెట్‌ ఛాలెంజ్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రికెట్ సిరీస్‌లో గేల్‌తో పాటు యువ‌రాజ్ సింగ్‌, ఇయాన్ మోర్గాన్‌, ఆండ్రీ ర‌సెల్‌, కెవిన్ పీట‌ర్స‌న్‌, ర‌షీద్ ఖాన్ పాల్గొంటున్నారు. 16 మ్యాచ్‌ల ఈ టోర్నీ ఓ స‌రికొత్త ఫార్మాట్‌లో జ‌ర‌గ‌నుంది. ఒక్కో ప్లేయ‌ర్ మ‌రో ప్లేయ‌ర్‌తో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. మొత్తం 4 ఇన్నింగ్స్‌. ఒక్కో ఇన్నింగ్స్‌లో 15 బాల్స్‌. ఎవ‌రు ఎక్కువ ర‌న్స్ చేస్తే వాళ్లు సెమీఫైన‌ల్‌, ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌తారు.

ఐపీఎల్ 2020లో క్రిస్‌ గేల్‌ రాణించాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లే ఆడిన యూనివర్స్ బాస్ 288 పరుగులు సాధించాడు. వయసు పెరిగినా ఇంకా తనలో పరుగులు చేసే సత్తా ఉందని నిరూపించాడు. మొత్తం మూడు హాఫ్ సెంచరీలతో పాటు రాజస్థాన్‌పై 99 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఒక్క పరుగు దూరంలో ఔటైన ఈ విండీస్ వీరుడు ఈ లీగ్‌లో ఏడో శతకాన్ని కోల్పోయాడు. గేల్‌ విండీస్ తరఫున 103 టెస్టులు, 301 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రం ఆపరేషన్!!సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రం ఆపరేషన్!!

Story first published: Saturday, January 2, 2021, 15:13 [IST]
Other articles published on Jan 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X