న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీపీఎల్ 2020 నుంచి గేల్ ఔట్.. కారణం అదేనా?!!

Chris Gayle pulls out of CPL 2020 due to personal reasons

జమైకా: వెస్టిండీస్ విధ్వంస‌క ఓపెనర్, యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ ‌గేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విండీస్ గడ్డపై ఈ ఏడాది జరగనున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2020 నుండి తాను తప్పుకుంటున్నట్టు గేల్ స్పష్టం చేసాడు. వ్యక్తిగత కారణాల కారణంగా సీపీఎల్ 2020లో ఆడట్లేదని 40 ఏళ్ల గేల్ ప్రకటించాడు. సీపీఎల్ టోర్నీ కోసం ఈ ఏడాది ఆటగాళ్ల 'డ్రాఫ్ట్'కు ఒక రోజు ముందు యూనివ‌ర్స‌ల్ బాస్ తప్పుకోవడం విశేషం. ఈ ఏడాది గేల్ సెయింట్ లూసియా జూక్స్ ప్రాంచైజీ తరఫున ఆడనున్నట్లు గత ఏప్రిల్‌లో ఒప్పందం చేశాడు.

కుటుంబంతో గడపడానికి:

కుటుంబంతో గడపడానికి:

'లాక్‌డౌన్ కారణంగా క్రిస్ ‌గేల్ జమైకాలో ఉన్నాడు. అతని కుటుంబం మాత్రం సెయింట్ కిట్స్ ప్రాంతంలో ఉంది. దీంతో గేల్ అతని భార్య, పిల్లలను కలవలేకపోయాడు. కుటుంబంతో గడపడానికి తనకు సమయం కావాలని ఈ మెయిల్‌లో రాసుకొచ్చాడు' అని ఓ స్పోర్ట్స్ పత్రిక కథనం రాసుకొచ్చింది. జమైకా తలైవాస్ తరఫున గత ఏడాది ఆడిన క్రిస్ ‌గేల్.. పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. దాంతో సీపీఎల్ 2020 సీజన్ కోసం క్రిస్ ‌గేల్‌ను తలైవాస్ జట్టు అట్టిపెట్టుకోలేదు. 2013 నుంచి సీపీఎల్ టోర్నీ ఆడుతున్న జమైకా వీరుడు గేల్.. 2,344 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

శర్వాన్ పెద్ద పాత్ర:

శర్వాన్ పెద్ద పాత్ర:

జమైకా తలైవాస్ ఫ్రాంఛైజీ తనని వదిలేయడానికి కారణం ఆ జట్టు సహాయ కోచ్ రామ్‌నరేశ్ శర్వాన్ మాటలేనని క్రిస్‌ గేల్ ఇటీవల ఆరోపించాడు. 'తలైవాస్ జట్టులో ఏం మార్పు. శర్వాన్.. ఈ కుట్రలో నీదే పెద్ద పాత్ర. నా జన్మదిన వేడుకల్లో మన స్నేహం గురించి పెద్ద స్పీచ్‌లు ఇచ్చావు. కానీ నువ్వో పాములాంటోడివి. నమ్మించి వెన్నుపోటు పొడిచావ్. ఈ కరేబీయన్ గడ్డ మీద నిన్ను ఎవరు ఇష్టపడరని నీకు తెలుసు. నీకు ఇప్పటికీ పరిపక్వత రాలేదు. ఈ కుట్రకు ఎప్పుడు ప్రణాళిక రచించావ్?' అని గేల్ మండిపడ్డాడు.

అవమానంలా భావించి?:

అవమానంలా భావించి?:

‌గేల్ విమర్శలపై జమైకా తలైవాస్ ఫ్రాంఛైజీ ఘాటుగా స్పందించింది. నిన్ను తప్పించడంలో శర్వాణ్‌ పాత్ర ఏమీలేదని, సవాలక్ష కారణాలున్నాయి అని స్పష్టం చేసింది. 'క్రిస్‌ గేల్‌ కాస్త తగ్గి మాట్లాడితే మంచిది. నిన్ను తీసివేయడానిక సవాలక్ష కారణాలున్నాయి. బహిరంగ విమర్శలు సరికాదు. నిన్నుతప్పించడంలో శర్వాణ్‌ పాత్ర ఏమీ లేదు. ఇక్కడ సెలక్షన్‌ కమిటీ, ఫ్రాంచైజీ ఉంది. నిన్నుఫ్రాంచైజీ కొనసాగించకూడదని నిర్ణయించుకుంది. దాంతోనే కొనసాగించలేదు. అంతే కానీ ఏ ఒక్కరూ నిన్ను తీసివేయడానికి కారణం కాదు' అని స్పష్టం చేసింది. గేల్‌కి ఆ రిప్లై ఓ అవమానంలా అనిపించినట్లుంది. అందుకే సీపీఎల్ 2020 సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.

మూడేళ్ల పాటు కాంటాక్ట్:

మూడేళ్ల పాటు కాంటాక్ట్:

2019లో జమైకా తలైవాస్ జట్టులోకి తిరిగి వచ్చిన గేల్‌.. అంతకుముందు 2013 నుంచి 2016 వరకూ ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది గేల్‌ తిరిగి జమైకాకు వచ్చిన క్రమంలో మూడేళ్ల పాటు కాంటాక్ట్‌ కుదుర్చుకున్నాడు. తన సీపీఎల్‌ కెరీర్‌ను హోమ్‌ టౌన్‌ ఫ్రాంచైజీతోనే ముగించాలనే ఉద్దేశంతోనే జమైకాకు ఆడుతున్నానని గేల్‌ తెలిపాడు. అయితే తాజా సీజన్‌లో గేల్‌ను జమైకా తలవాస్‌ వదిలేసుకుంది.

సీపీఎల్‌‌కు కరోనా దెబ్బ:

సీపీఎల్‌‌కు కరోనా దెబ్బ:

ఇక షెడ్యూల్ ప్రకారం సీపీఎల్ 2020 సీజన్ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 26 మధ్య జరగనుంది. కానీ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఈ షెడ్యూల్‌లో మార్పులు సంభవించవచ్చు. ఒకవేళ ఈ టోర్నీ జరిగినా.. ఓవర్సీస్ ప్లేయర్లు లేకుండా ఖాళీ మైదానాల్లో జరిగే అవకాశం ఉంది. లేకుంటే డిసెంబర్‌కు వాయిదా పడవచ్చు. లీగ్ నిర్వాహకులు ఎప్పటికప్పుడూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

'నా జీవితంలో ద్రవిడ్ లాంటి వ్యక్తి ఉండటం ఎంతో అదృష్టం'

Story first published: Wednesday, June 24, 2020, 13:12 [IST]
Other articles published on Jun 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X