న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

39 ఏళ్ల వయస్సు: 39 సిక్సర్లు: ఓ సిరీస్ లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డ్

Chris Gayle on world record in England ODIs: Fantastic to hit 39 sixes aged 39

సెయింట్ లూసియా: వెస్టిండిస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్.. మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. అదీ తన సొంత గడ్డ మీద. అయిదు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ తో అయిదు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో క్రిస్ గేల్ ఇప్పటికే పరుగుల వరదను సృష్టించాడు. చివరి వన్డేలో కూడా తనదైన శైలిలో ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 27 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రిస్ గేల్ వయస్సు 39 సంవత్సరాలు. ఈ సిరీస్ లో కూడా అతను కొట్టిన సిక్సర్ల సంఖ్య కూడా 39. ఈ ఏడాది ఐసీసీ ప్రపంచకప్ తరువాత రిటైర్ అవుతానని ప్రకటించిన తరువాత క్రిస్ గేల్.. ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో 424 పరుగులు సాధించాడు. 134 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు.

సొంతగడ్డపై ఇదే చివరి వన్డే..

ఇంగ్లండ్ , వెస్టిండీస్ మధ్య జరిగిన అయిదు వన్డేల సిరీస్ డ్రాగా ముగిసింది. రెండు జట్లు 2-2తో నిలిచాయి. వర్షం కారణంగా మూడో వన్డే రద్దయింది. సెయింట్ లూసియాలో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ విధ్వంసం సృష్టించాడు. 27 బంతుల్లో 77 పరుగులు చేశాడు. 27 బంతుల్లో తొమ్మిది సిక్సర్లు, అయిదు ఫోర్లతో 77 పరుగులు చేశాడు. వుడ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 28.1 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. థామస్ అయిదు వికెట్లు తీసుకుని ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 12.1 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

సొంతగడ్డపై క్రిస్ గేల్ ఆడిన చివరి వన్డే మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఇక ముందు అతను సొంత దేశంలో క్రికెట్ ఆడలేడు. ప్రపంచకప్ తరువాత గేల్.. రిటైర్ మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్ ను ఇంగ్లండ్, వేల్స్ సంయుక్తంగా నిర్వహించబోతోంది. ఈలోగా మరే సిరీస్ కూడా వెస్టిండీస్ లో నిర్వహించట్లేదు. దీనితో- సొంతగడ్డపై ఇదే తన చివరి మ్యాచ్ అని గేల్ చెప్పాడు. ఈ సందర్భంగా అతను ఉద్విగ్నంగా మాట్లాడాడు.

సొంత దేశానికి ఆడటం.. గౌరవం

స్వదేశానికి క్రికెట్ ఆడటం ఎప్పుడూ తనకు దక్కిన గౌరవంగా భావించానని క్రిస్ గేల్ చెప్పాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అతను విలేకరులతో మాట్లాడాడు. గుండెపై వెస్టిండీస్ పతాకాన్ని ధరించడం తన అదృష్టమని అన్నాడు. చివరి వన్డే కావడం వల్ల ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి శాయశక్తులా కృషి చేశానని అన్నాడు. అటు ఇంగ్లండ్, ఇటు విండీస్ అద్భుతంగా రాణించాయని గేల్ చెప్పుకొచ్చాడ. ఈ సిరీస్ తో తాను మళ్లీ ఫామ్ లోకి రావడం ఆనందంగా ఉందని అన్నాడు. ప్రపంచకప్ లో ఇదే ఫామ్ ను కొనసాగిస్తానని చెప్పాడు. తనకు 60 ఏళ్లు వచ్చేంత వరకూ క్రికెట్ ఆడే సత్తా ఉందని గేల్ చెప్పాడు. 39 ఏళ్ల వయస్సులో 39 సిక్సర్లను బాదడం మాటలు కాదని, తాను ఈ రికార్డును అస్సలు ఊహించనే లేదని అన్నాడు.

Story first published: Sunday, March 3, 2019, 17:44 [IST]
Other articles published on Mar 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X