న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్సర్ కింగ్: ఆఫ్రిది రికార్డును సమం చేసిన క్రిస్‌గేల్

By Nageshwara Rao
Chris Gayle Equals Shahid Afridis Record For Most Sixes In International Cricket

హైదరాబాద్: వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌ గేల్‌ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిదితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో గేల్‌(73; 66 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఐదో సిక్సర్‌ను సాధిండం ద్వారా క్రిస్ గేల్‌ తన కెరీర్‌లో 476వ సిక్సర్‌ను నమోదు చేశాడు. దీంతో ఆఫ్రిది(476 సిక్సర్లు) సిక్సర్ల రికార్డును గేల్‌ సమం చేశాడు.

1
43703

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ఆఫ్రిది, గేల్‌ తర్వాత బ్రెండన్‌ మెకల్లమ్‌(398), సనత్‌ జయసూర్య(352), ఎంఎస్‌ ధోని(342), ఏబీ డివిలియర్స్‌(328), రోహిత్‌ శర్మ(291), మార్టిన్‌ గప్టిల్‌(274), సచిన్‌ టెండూల్కర్‌(264)లు ఉన్నారు.

ఇదిలా ఉంటే వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా తొమ్మిదేళ్ల తర్వాత వెస్టిండీస్‌ గడ్డపై బంగ్లాదేశ్‌ సిరీస్‌ గెలుచుకుంది. కాగా, క్రిస్ గేల్ మొత్తం టీ20ల్లో 103 సిక్సర్లు, వన్డేల్లో 275, టెస్టుల్లో 98 సిక్సర్లు కొట్టాడు.

Story first published: Monday, July 30, 2018, 14:22 [IST]
Other articles published on Jul 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X