న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విలన్‌గా మారిన క్రికెటర్.. హీరో సూర్యకు పోటాపోటీగా.. ఎవరీ చిరాగ్ జానీ!

Chirag Jani: Cricketer who turned to movie star

హైదరాబాద్: సౌరాష్ట్రకు చెందిన చిరాగ్ జానీ క్రికెటర్ సినీ స్టార్‌గా మారాడు. ఇప్పటికే హిందీ చిత్రాల్లో నటించిన చిరాగ్ ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తాజాగా ఆయన నటించిన బందోబస్త్ చిత్రంలో విలన్‌గా తన మార్క్ నటనను ప్రదర్శించాడు.

ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య, మోహన్ లాల్, సాయేషా సైగల్, ఆర్య నటించిన ఈ చిత్రంలో ఉగ్రవాదిగా పాత్రలో నటించి మెప్పించాడు. క్రికెటర్‌గా రాణించిన చిరాగ్ గురించి మరింత సమాచారం మీకోసం.. తాజాగా శుక్రవారం సూర్య హీరోగా బందోబస్త్ చిత్రంలో రంజిత్ అనే ఉగ్రవాది పాత్రలో చిరాగ్ జానీ నటించారు.

Pic Viral: 16 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీ ఎలా ఉన్నాడో తెలుసా?Pic Viral: 16 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీ ఎలా ఉన్నాడో తెలుసా?

ప్రధాని హత్యకు కుట్ర

ప్రధాని హత్యకు కుట్ర

ప్రధాని హత్యకు కుట్రపన్నే పాత్రలో చిరాగ్ ప్రదర్శించిన క్రూరత్వం తెర మీద కొత్తగా కనిపించింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎత్తులకు పైఎత్తులుగా సాగే చిత్రంలో చిరాగ్‌కు మార్కులే పడ్డాయి. బందోబస్త్‌లో చూపిన ఫెర్ఫార్మెన్స్ దక్షిణాదిలో మరిన్నీ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బందోబస్త్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

బందోబస్త్ చిత్రంలో అనూహ్యంగా

బందోబస్త్ చిత్రంలో అనూహ్యంగా రంజిత్ పాత్ర చిరాగ్ జానీకి దక్కింది. వాస్తవానికి ముందుగా ఈ పాత్ర కోసం అల్లు శిరీష్‌ను ఎంపిక చేశారు. లండన్‌లో షూటింగ్‌కు అల్లు శిరీష్ సిద్ధమయ్యాడు. కానీ ఏబీసీడి సినిమా కారణంగా డేట్స్ సమస్య రావడంతో బందోబస్త్ నుంచి తప్పుకొన్నాడు. దాంతో ఈ భారీ ప్రాజెక్టులో నటించే అవకాశం కొట్టేశాడు.

రాజేష్ బబ్బర్ దర్శకత్వంలో

రాజేష్ బబ్బర్ దర్శకత్వంలో

ఇదిలా ఉండగా, క్రికెట్‌కు వీడ్కోలు పలికి సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు ఈ యువ క్రికెటర్. రాజేష్ బబ్బర్ దర్శకత్వంలో రూపొందిన హిందీ సీరియల్ 'సప్నే సుహానే లడక్పాన్ కే'‌లో వైష్ణవి మహంత్‌తో జతకట్టి హిందీ వినోద పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత 2016లో 'యాహన్ అమీనా బిక్తీ హై' అనే హిందీ సినిమాతో పెద్ద స్క్రీన్‌పై దర్శనమిచ్చాడు.

దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం

దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం

దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించిన చిరాగ్ జానీ ఆల్ రౌండర్‌గా ఫరవాలేదనిపించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 3 మ్యాచ్‌లు ఆడిన అతడు 20 యావరేజితో 100 పరుగులు చేశాడు. కుడి చేతివాటం బ్యాట్స్‌మన్ అయిన చిరాగ్ జానీ మంచి బౌలర్ కూడా. తన మీడియం పేస్ బౌలింగ్‌తో 4 వికెట్లు పడగొట్టాడు. 8 లిస్ట్ ఏ మ్యాచ్‌లాడిన చిరాగ్ జానీ 430 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్‌గా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Friday, September 20, 2019, 19:22 [IST]
Other articles published on Sep 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X