న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడు నెలల తర్వాత బ్యాట్ పట్టిన పుజారా!!

Cheteswar Pujara Restart Training After 3 Month Break Due To Coronavirus Lockdown


న్యూఢిల్లీ:
భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, నయా వాల్ చతేశ్వర్ పుజారా మూడు నెలల విరామం తర్వాత మళ్లీ బ్యాట్ పట్టాడు. మార్చిలో సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీలో ఆడిన పుజారా.. ఆ తర్వాత కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమయ్యాడు. కరోనా లాక్‌డౌన్‌ సడలింపులతో.. రాజ్‌కోట్‌లోని తన క్రికెట్‌ అకాడమీలో రంజీ జట్టు సభ్యులతో కలిసి నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు.

సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తోన్న చతేశ్వర్ పుజారా గత ఏడాది తన జట్టుకు తొలి రంజీ టైటిల్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ రంజీ ఫైనల్‌ అనంతరం పుజారా మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. తాజా ప్రాక్టీస్ సెషన్‌కి ముందు ఫ్యాడ్స్‌ని కట్టుకుంటున్న ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. 'నేనొచ్చేశా. చాలా కాలం దూరంగా ఉన్నట్లు అనిపించింది. అయితే ప్రాక్టీస్‌ మొదలుపెట్టాక నిన్ననే ప్రాక్టీస్‌ చేసినట్లు అనిపించింది' అంటూ దానికి కామెంట్‌ జత చేశాడు.

పుజారాతో పాటు ఆ ప్రాక్టీస్ సెషన్‌కి ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్, సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్ అర్పిత్ వాసవడ హాజరయ్యారు. భారత్ తరఫున కేవలం టెస్టులు మాత్రమే చతేశ్వర్ పుజారా ఆడుతున్నాడు. టీమిండియా ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడబోతోంది. దీంతో ఇప్పటి నుంచే పుజారా ప్రాక్టీస్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. డిసెంబరు 3 నుంచి బ్రిస్బేన్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో పింక్‌బాల్‌ టెస్టు ఆడేందుకు భరత ఫాస్ట్‌ బౌలర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పుజారా తాజాగా అభిప్రాయపడ్డాడు. 'బుమ్రా, షమీ, ఇషాంత్‌కు ఇది వరకే పింక్‌బాల్‌ టెస్టు ఆడిన అనుభవం ఉంది. ఈ ముగ్గురూ ఆస్ట్రేలియాతో ఆ టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా బంగ్లాతో తలపడిన తొలి పింక్‌బాల్‌ మ్యాచ్‌ను వాళ్లెంతో ఆస్వాదించి ఉండొచ్చు. అలాగే ఆస్ట్రేలియా పిచ్‌లపై పింక్‌బంతితో బౌలింగ్‌ చేయడం వారికి గొప్ప అనుభూతిని మిగులుస్తుందని విశ్వసిస్తున్నా' అని పుజారా వివరించాడు.

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఆటగాళ్లంతా ఏళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. క్రికెట్‌ టోర్నీలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో ప్లేయర్లు తిరిగి ప్రాక్టీస్‌ బాటపడుతున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటన కోసం వెస్టిండీస్ జట్టు అక్కడికి వెళ్ళింది. పాక్ కూడా ఇంగ్లండ్ టూర్ కోసం వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.

పాక్‌ క్రికెట్‌కు కరోనా సెగ.. మరో ముగ్గురు క్రికెటర్లకు పాజిటివ్‌!!పాక్‌ క్రికెట్‌కు కరోనా సెగ.. మరో ముగ్గురు క్రికెటర్లకు పాజిటివ్‌!!

Story first published: Tuesday, June 23, 2020, 11:22 [IST]
Other articles published on Jun 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X