న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వంట చేయడం రాదు.. అందుకే ఇళ్లు, పాత్రలు శుభ్రం చేస్తున్నా: స్టార్ క్రికెటర్

Cheteshwar Pujara reveals his routine during coronavirus lockdown

సౌరాష్ట్ర: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం 21 లాక్​డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆటగాళ్లంతా తమ ఇళ్లలోనే ఉండిపోయారు. కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. మరికొందరు ప్రజల్లో కరోనాపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజార ఇంట్లోని పనులతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం సమయమంతా కుటుంబంతో గడుపుతున్నానని, దీంతో తన కూతురు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

కరోనా ఎఫెక్ట్.. ఫిఫా అండర్​-17 ప్రపంచకప్ వాయిదా!!కరోనా ఎఫెక్ట్.. ఫిఫా అండర్​-17 ప్రపంచకప్ వాయిదా!!

సరైన నిర్ణయం తీసుకుంది:

సరైన నిర్ణయం తీసుకుంది:

ఓ ఇంటర్వ్యూ ద్వారా చతేశ్వర్ పుజార తన లాక్​డౌన్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నాడు. 'కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే.. ఇటలీ, జపాన్, అమెరికాతో పాటు చాలా దేశాల్లో వైరస్ విపరీతంగా వ్యాపిస్తుంది. ఆ తర్వాత వారు లాక్​డౌన్ చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో వైరస్​ను కట్టి చేడయం చాలా కష్టం. క్రీడాకారుడిగా లాక్​డౌన్ కష్టంగా కనిపించినా.. వ్యక్తిగతంగా, పౌరుడిగా నేను పూర్తి మద్దతునిస్తా. పౌరులందరూ ఈ లాక్​డౌన్ వారి స్వంత భద్రత కోసమేనని అర్థం చేసుకోవాలి' అని పుజార అన్నాడు.

నా భార్యకు సాయం చేస్తున్నా:

నా భార్యకు సాయం చేస్తున్నా:

'క్రికెట్ టోర్నీలు ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రాదు. లాక్​డౌన్ వల్ల సానుకూలత అంటే ఇదొక్కటే. ఈ సమయాన్ని వినియోగించుకోవాలని ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నా. కుటుంబ సబ్యులకు సాయం చేయండి. నేను కూడా నా భార్యకు సాయం చేస్తున్నా. నాకు వంట చేయడం రాదు. అందుకే.. ఇల్లు, పాత్రలు శుభ్రం చేస్తూ.. నా భార్యకు సాయం చేస్తున్నా. ఇంతకు ముందు మనం చేయని పనులను ఇప్పుడు చేయడం కూడా ముఖ్యం' అని పుజార తెలిపాడు.

కూతురితో ఆడుకుంటున్నా:

కూతురితో ఆడుకుంటున్నా:

'ఇంట్లో ఎక్కువ సమయం కూతురు పూజతోనే ఆడుకుంటున్నా. నేను ఇంట్లో లేనప్పుడు పూజ వాళ్ల అమ్మతో ఉంటుంది. ఇప్పుడు ఇద్దరం పక్కనే ఉంటుండడంతో పూజ చాలా సంతోషంగా ఉంది. నాతో ఆడుకోవడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నది. ఇండోర్ గేమ్స్ ఆడుతున్నాం. కొన్నిసార్లు కలరింగ్ ఇష్టపడుతుంది, అప్పుడు నేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. మా ఇంట్లోని చిన్న తోటలో పూజతో బ్యాడ్మింటన్ ఆడుతున్నాం. పూజ చాలా ఎనెర్జిటిక్. నా కూతురు ఆటలను, అల్లరిని కెమెరాలో ఎక్కువగా బంధిస్తున్నా' అని పుజార చెప్పుకొచ్చాడు.

విరామం మంచిదే:

విరామం మంచిదే:

'నేను ఒంటరిగా ఉండవలసి వస్తే.. ఉంటాను. నాతో నేను తగినంత సమయం గడపగలను. నాకు పుస్తకాలు చదవడం ఇష్టం కాబట్టి నేను ఉండగలుగుతా. అయితే అదృష్టవశాత్తూ నా కుటుంబం నా పక్కనే ఉంది. ప్రతిఒక్కరూ విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నా. ఎందుకంటే చాలా క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఈ విరామం మంచిదే. కొందరు ఈ ఖాళీ సమయంలో ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నారు. క్రికెట్ ప్రారంభమైన తర్వాత మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉంటారు. ఈ విరామం ఆటగాళ్లకు రిఫ్రెష్' అని పుజార పేర్కొన్నాడు.

Story first published: Saturday, April 4, 2020, 15:54 [IST]
Other articles published on Apr 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X