న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఈ సిరిస్‌లో పుజారా ముందు ఆసీస్ బౌలర్లు మోకరిల్లారు'

 Cheteshwar Pujara deserves many privileges in Kohlis kingdom: Ian Chappell

హైదరాబాద్: విరాట్ కోహ్లీ 'కింగ్‌డమ్'లో పరుగుల వరద పారించిన ఛటేశ్వర్ పుజారా ఎన్నో ఘనతలకు అర్హుడని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం ఇయాన్ ఛాపెల్‌ అన్నాడు. తన అద్భుతమైన ఆటతీరుతో ఆస్ట్రేలియా బౌలర్లను మోకరిల్లేలా చేశాడని అభిప్రాయపడ్డాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుని ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

<strong>అనుష్కతో కలిసి సిడ్నీ మైదానంలో విరాట్ కోహ్లీ 'విక్టరీ వాక్' (వీడియో)</strong>అనుష్కతో కలిసి సిడ్నీ మైదానంలో విరాట్ కోహ్లీ 'విక్టరీ వాక్' (వీడియో)

ఈ నేపథ్యంలో ఛాపెల్ మాట్లాడుతూ "భారత క్రికెట్‌లో ఇప్పుడు విరాట్ కోహ్లీ రాజు కావొచ్చు. కానీ.. ఆ రాజ్యంలో పుజారా కూడా ఎన్నో గౌరవాలకి అర్హుడని నిరూపించాడు. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఎంతో మంచి జరిగింది. సిరీస్‌ చేజిక్కించుకోడమే కాదు పుజారాలోని పట్టుదల, క్రమశిక్షణ, ఓపిక విలువ తెలిసింది" అని అన్నాడు.

పుజారా అద్భుత బ్యాటింగ్‌

పుజారా అద్భుత బ్యాటింగ్‌

"పుజారా అద్భుత బ్యాటింగ్‌ నుంచి చాలా నేర్చుకుని ఉంటుంది. సహనంలో క్రీజులో నిలిచిన పుజారా.. భీకరమైన ఆస్ట్రేలియా బౌలర్లని సైతం అసహనంతో మోకాళ్లపై కూలబడేలా చేశాడు. ఆస్ట్రేలియాలో మూడు సెంచరీలు చేసిన అతడు సునిల్‌ గావస్కర్‌ రికార్డును సమం చేశాడు. ఏడు ఇన్నింగ్సుల్లో 521 పరుగులు చేశాడు. 1,867 నిమిషాలు క్రీజులో ఉన్నాడు" అని ఛాపెల్ అన్నాడు.

ఈ సిరిస్‌లో 1,258 బంతులు ఎదుర్కొన్న పుజారా

ఈ సిరిస్‌లో 1,258 బంతులు ఎదుర్కొన్న పుజారా

"1,258 బంతులు ఎదుర్కోన్నాడు. ఆసీస్‌ ఆటగాళ్లంతా విరాట్‌ కోహ్లీపై దృష్టి సారిస్తే అవతలి వైపు నుంచి పుజారా తన పని అద్భుతంగా పూర్తిచేశాడు. పైగా సిరీస్‌ విజయం అందించాడు. ప్రత్యర్థి టాప్‌ క్లాస్‌ బౌలర్లను చిరాకు పెట్టాడు" అని ఛాపెల్ చెప్పుకొచ్చాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న తొలి భారత క్రికెటర్‌గా పుజారా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

ద్రవిడ్ రికార్డు బద్దలు

ద్రవిడ్ రికార్డు బద్దలు

ఈ సిరిస్‌కు ముందు ఆస్ట్రేలియా‌లో జరిగిన ఓ టెస్టు సిరీస్‌లో ఇప్పటి వరకూ అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత క్రికెటర్‌గా రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉండగా తాజాగా ఆ రికార్డుని పుజారా అధిగమించిన సంగతి తెలిసిందే. 2003-04లో జరిగిన ఆసీస్ పర్యటనలో రాహుల్ ద్రవిడ్ 1,203 బంతులతో ఆ రికార్డ్‌ని నెలకొల్పగా.. పుజారా 1,258 బంతులతో దానిని బద్దలు కొట్టాడు.

పంత్‌పై ప్రశంసలు

పంత్‌పై ప్రశంసలు

ఈ జాబితాలో మూడో స్థానంలో విజయ్ హజారే (1947-48) 1,192 బంతులతో ఉండగా.. విరాట్ కోహ్లీ (2014-15) 1,093 బంతులు, సునీల్ గవాస్కర్ (1977-78) 1,032 బంతులతో టాప్-5లో ఉన్నారు. సిడ్నీ టెస్టులో 159 పరుగులు చేసిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై కూడా ఇయాన్ ఛాపెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. "సిడ్నీ టెస్టులో పంత్ తన ప్రతిభను ప్రదర్శించాడు. క్రమశిక్షణతో ఆడాడని వెల్లడించాడు. మెల్‌బోర్న్‌ పిచ్‌పై తన ఆటతీరులో మార్పును చూపించేందుకు ప్రయత్నించాడు. సిడ్నీలో కోహ్లీ డిక్లేర్‌ చేసే లోపు అతడు మరింత హుందాను ప్రదర్శించాడు" అని ఇయాన్ ఛాపెల్‌ మెచ్చుకున్నాడు.

Story first published: Monday, January 7, 2019, 15:23 [IST]
Other articles published on Jan 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X