న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: చెన్నై అభిమానులకు షాక్.. సురేష్ రైనా పేరును తొలగించిన సీఎస్‌కే!!

Chennai Super Kings remove Suresh Rainas name from their official website
IPL 2020 : Chennai Super Kings Removed Suresh Raina’s Name From The Official Website || Oneindia

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు సభ్యులతో పాటు దుబాయ్ వెళ్లిన ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్, మిస్టర్ ఐపీఎల్‌ సురేష్ రైనా.. వారం రోజులు తిరగకముందే స్వదేశానికి వచ్చేశాడు. రైనా అర్ధాంతరంగా టోర్నీ నుండి తప్పుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. కరోనా భయం, కుటుంబంపై బెంగ, ప్రాంచైజీతో గొడవ అంటూ అప్పట్లో వార్తలు వచ్చినా.. రైనా వాటిని ఖండించాడు. సన్నిహితుల (మేనత్త కుటుంబం) మరణం కారణంగానే తాను ఐపీఎల్‌కు దూరం అవుతున్నట్లు అతడు స్పష్టం చేశాడు.

వ్యక్తిగత కారణాలతో:

వ్యక్తిగత కారణాలతో:

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో సురేష్ రైనా మేనత్త కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన రైనా.. విషయం తెలుసుకుని స్వదేశానికి తిరిగొచ్చాడు. తన మేనత్త కుటుంబంపై దాడికి పాల్పడిన నిందితులను పట్టుకోవాలని పంజాబ్ సీఎంను రైనా కోరాడు. రైనా ప్రత్యేకంగా కోరడంతో సీఎం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేసి నిందులను పట్టుకున్నారు. దీంతో రైనా మళ్లీ ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళుతాడు అనే వార్తలు వచ్చాయి.

#ComeBackMrIPL:

#ComeBackMrIPL:

మరోవైపు చెన్నై అభిమానులంతా #ComeBackMrIPL యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. దీనికి తోడు కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ సురేష్ రైనా సేవలను గుర్తు చేసుకోవడంతో అతను మళ్లీ వచ్చే చాన్స్ ఉందా? అనే సందేహం అభిమానులకు కలిగింది. ఇదే ప్రశ్నను ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ముందు ఉంచగా.. అలాంటిదేం లేదని స్పష్టం చేశారు. రైనా వైపు తాము చూడటం లేదని, టోర్నీకి దూరంగా ఉండటం అతని వ్యక్తిగత నిర్ణయమన్నారు. రైనా నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు.

 రైనా పేరును తొలగించిన సీఎస్‌కే:

రైనా పేరును తొలగించిన సీఎస్‌కే:

తాజాగా సురేశ్ రైనా పేరును చెన్నై సూపర్ కింగ్స్ తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. రైనా పేరుతో పాటు హర్భజన్ సింగ్ పేరును కూడా అఫీషియల్ వెబ్‌సైట్లో నుంచి తొలగించారు. దీంతో ఈ సీజన్లో రైనా జట్టులోకి తిరిగి రావడం లేదని చెన్నై జట్టు చెప్పకనే చెప్పింది. ఇక రైనా, హర్భజన్ లాంటి సీనియర్లు దూరమైన ప్రభావం చెన్నై మీద బాగానే పడింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన చెన్నై.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక అంబటి రాయుడు గాయం కారణంగా రెండు, మూడో మ్యాచ్‌లకు దూరం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికైనా చెన్నై పుంజుకుంటుందో చూడాలి. అక్టోబర్ 2న చెన్నై తన తదుపరి మ్యాచ్ ఆడనుంది.

తొలి భారతీయ క్రికెటర్‌గా:

తొలి భారతీయ క్రికెటర్‌గా:

ఆగస్టు 15న సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్‌ల్లో 768, వన్డేల్లో 5615, టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఏడు సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన రైనా.. టెస్ట్‌ల్లో 13, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రైనా పేరుపై రికార్డు ఉంది. చురుకైన ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన రైనా.. తన కెరీర్‌ మొత్తంలో 167 క్యాచ్‌లు అందుకున్నాడు.

Story first published: Tuesday, September 29, 2020, 10:25 [IST]
Other articles published on Sep 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X