న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై విజయాల్లో కీలకపాత్ర: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మోర్కెల్

Chennai Super Kings pay tribute to former all-rounder Albie Morkel as he announces retirement

హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ అల్బీ మోర్కెల్‌ (37) అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం వీడ్కోలు పలికాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ మాజీ ఆల్ రౌండర్‌కు ఇండియాలో భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు.

రంజీ క్రికెట్‌లో వింత ఘటన: 35/3 నుంచి 35 పరుగులకే ఆలౌట్ రంజీ క్రికెట్‌లో వింత ఘటన: 35/3 నుంచి 35 పరుగులకే ఆలౌట్

2011లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలవడంలో అల్బీ మోర్కెల్‌ కీలకపాత్ర పోషించాడు. దీంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అత్యధిక వికెట్లు(91) తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. టీ20 ఆల్ రౌండర్‌గా అల్బీ మోర్కెల్‌ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

అల్భీ మోర్కెల్‌ దక్షిణాఫ్రికా తరఫున 58 వన్డేలు, 50 టీ20లు, ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ ఆల్‌రౌండర్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి 77 వికెట్లు పడగొట్టగా, 1,412 పరుగులు చేశాడు. 2011 ఐపీఎల్‌ ట్రోఫీని గెల్చుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో మోర్కెల్‌ సభ్యుడిగా ఉన్నాడు.

ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున మొత్తం 92 మ్యాచ్‌లాడి 91 వికెట్లతో పాటు 909 పరుగులు నమోదు చేశాడు. 2011 సీజన్‌లో అల్బీ మోర్కెల్ మొత్తం 15 వికెట్లు తీసి 138 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన ఓ మ్యాచ్‌లో అల్బీ మోర్కెల్ 28 పరుగులు చేసి ఒంటిచేత్తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మోర్కెల్ వీడ్కోలు పలికిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంఛైజీ ప్రత్యేకంగా ఓ ట్విట్ చేసింది.

Story first published: Thursday, January 10, 2019, 10:36 [IST]
Other articles published on Jan 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X