చెన్నై కోసం చెఫ్‌గా మారిన డుప్లెసిస్, విజయోత్సాహంలో స్టేడియమంతా జోరు..హోరు

Posted By:
Chef Faf du Plessis Goes Shirtless as He Cooks for CSK Teammates

హైదరాబాద్: వరుసగా ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచి విజయోత్సాహంలో ఉంది చెన్నై జట్టు. ఈ సందర్భంగా సూపర్ కింగ్స్ అంతా కలిసి మరో మ్యాచ్‌కు ఇంకా విరామం ఉన్నందును సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్లేయర్ ఫాప్ డుప్లెసిస్. తన టీమ్ మేట్స్‌కు వండిపెట్టాడు. ఐపీఎల్ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన సంతోషంలో ఉన్న చెన్నై టీమ్‌కు కోచ్ ఫ్లెమింగ్‌తో కలిసి డుప్లెస్సి స్పెషల్ వంటకాలు చేసి పెట్టారు.

వాళ్లు వంట చేస్తున్న సమయంలో హర్భజన్‌సింగ్ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఒంటిపై షర్ట్ కూడా లేకుండా డుప్లెస్సి వంట చేస్తున్న ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.

సహచర ఆటగాళ్ల కోసం చెఫ్‌ అవతారంలో:

సహచర ఆటగాళ్ల కోసం చెఫ్‌ అవతారంలో:

జట్టులోని సహచర ఆటగాళ్ల కోసం చెఫ్‌ అవతారమెత్తాడు డూప్లెసిస్‌. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ప్లెమింగ్‌.. డూప్లెసిస్‌కు సాయం చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను హర్భజన్‌ సింగ్‌ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘హౌస్‌లో కొత్త చెఫ్‌లు. ఇద్దరూ కలిసి ఎంతో ఫేమస్‌ అయిన ‘న్యూజిలాండ్‌ లాంబ్‌ ఛాప్స్‌' వంటకాన్ని తయారు చేస్తున్నారు' అని భజ్జీ తెలిపాడు.

రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై:

ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై సూపర్‌‌కింగ్స్‌ విజయం సాధించింది. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌లో చెన్నై.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో డూప్లెసిస్‌ ఆడే అవకాశం ఉంది.

 కూల్‌డ్రింక్స్‌ సరఫరా చేస్తూ కనిపించిన డూప్లెసిస్‌

కూల్‌డ్రింక్స్‌ సరఫరా చేస్తూ కనిపించిన డూప్లెసిస్‌

గాయం కారణంగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆడిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు దక్షిణాఫ్రికా ఆటగాడు డూప్లెసిస్‌. సొంత మైదానం చెపాక్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆటగాళ్లకు కూల్‌డ్రింక్స్‌ సరఫరా చేస్తూ కనిపించి అభిమానుల మనసును గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనూ అతడిపై ఆందోళనకారులు బూటు విసిరినా ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయకుండా.. దాన్ని తీసుకువచ్చి మైదానం బయట పడేశాడు.

 రైనా, వాట్సన్, ఫ్లెమింగ్, తాహిర్, మైక్ హస్సీ:

రైనా, వాట్సన్, ఫ్లెమింగ్, తాహిర్, మైక్ హస్సీ:

మరోవైపు రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆనందంలో ఉన్న చెన్నై టీమ్‌కు మరో రూపంలో షాక్ తగిలింది. కావేరీ ఆందోళనల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చెన్నై నుంచి పుణెకు తరలిపోయిన విషయం తెలిసిందే. దీనిపై టీమ్ ప్లేయర్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. రైనా, వాట్సన్, ఫ్లెమింగ్, తాహిర్, మైక్ హస్సీ ట్విట్టర్‌లో తమ బాధను వ్యక్తీకరించారు.

రెండు మ్యాచ్‌‌లకు రైనా దూరం:

రెండు మ్యాచ్‌‌లకు రైనా దూరం:

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో ఏప్రిల్ 10న జరిగిన మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌ వేసిన 10వ ఓవర్‌లో సింగిల్‌ తీసే సమయంలో రైనా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కాలి గాయానికి వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో సీఎస్‌కే ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎస్‌కే ఆటగాడు కేదార్‌ జాదవ్‌ సీజన్‌ మొత్తానికి దూరమైన సంగతి తెల్సిందే. తాజాగా రైనా కూడా గాయపడటం సీఎస్‌కేకి పెద్ద ఎదురు దెబ్బే.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 12, 2018, 16:58 [IST]
Other articles published on Apr 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి