న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలు టాంపరింగ్‌కు కారణం వార్నర్: తేల్చేసిన సీఏ

Cheating mastermind David Warner orchestrated the sandpaper plot and even taught Cameron Bancroft how to tamper with the ball

హైదరాబాద్: ట్యాంపరింగ్ విషయంలో విచారణ అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియా ఫలితాలు వెల్లడించింది. ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారం మొత్తానికి డేవిడ్ వార్నరే కారణమని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టంచేసింది. ఈ కుతంత్రాన్ని కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ తెలిసీ అడ్డుకోలేకపోయాడని తెలిపింది. అందుకు తగ్గట్టుగానే స్మిత్‌కు ఏడాది పాటు నిషేదాన్ని విధించి, వార్నర్‌కు జీవిత కాలం కెప్టెన్సీ పొందే అర్హత లేదని నిర్ణయించింది క్రికెట్ ఆస్ట్రేలియా.

క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపిన వివరాల ప్రకారం.. బాల్ టాంపరింగ్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి అన్న ప్లాన్ మొత్తం డేవిడ్ వార్నర్‌దేనట. ఇదే విషయాన్ని అతడు స్మిత్‌తో చెప్పడంతో అతను అంగీకరించాడు. ఈ పని కోసం బాన్‌క్రాఫ్ట్‌ను వార్నరే ఎంపిక చేశాడని సమాచారం. సాండ్‌పేపర్‌తో టాంపరింగ్ చేయాలని బాన్‌క్రాఫ్ట్‌కు సూచించడమే కాదు.. ఎలా చేయాలో కూడా డెమో ఇచ్చాడట.

దీంతో వార్నర్, స్మిత్‌లపైనే క్రికెట్ ఆస్ట్రేలియా కఠినంగా వ్యవహరించింది. వాళ్లిద్దరిపైనా ఏడాది నిషేధం విధించింది. వాళ్ల ప్లాన్‌ను అమలు చేసిన బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధంతో సరిపెట్టింది. అంతేకాదు ఆస్ట్రేలియా క్రికెట్ పరువు తీసిన ఈ ఘటనకు కారణమైన వార్నర్ భవిష్యత్తులో ఆస్ట్రేలియాకు కెప్టెన్సీ వహించే అవకాశాన్ని కోల్పోయాడు.

అతని పేరెప్పుడూ కెప్టెన్సీకి పరిగణించబోమని సీఏ స్పష్టంచేసింది. స్మిత్‌కు మాత్రం నిషేధం ముగిసిన మళ్లీ కెప్టెన్సీ అవకాశం రావచ్చు. అయితే ఇంత జరిగినా.. వార్నర్ మాత్రం ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పలేదు. మరోవైపు స్మిత్, బాన్‌క్రాఫ్ట్ తాము చేసిన తప్పునకు పశ్చాత్తాప పడుతూ క్షమాపణలు చెప్పారు.

Story first published: Friday, March 30, 2018, 15:56 [IST]
Other articles published on Mar 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X