న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకటి చెప్పనా..! బ్యాటూ క్రీజులో ఉంటేనే కదా.. సేఫ్‌గా ఉండేది! మన్కడింగ్ దెబ్బకు సెట్టయిన ఇంగ్లాండ్ పాప

Charlie Dean Cryptic Tweet After She Got Out by Deepti Sharmas Mankading

ఇంగ్లాండ్ వుమెన్స్ టీం ఆల్‌రౌండర్ చార్లీ డీన్ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్‌పై ఐకానిక్ వేదిక అయిన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడడం తనకు చాలా గౌరవంగా ఉందని తెలిపింది. ఇకపోతే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మూడో వన్డే మ్యాచ్‌లో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఛార్లీ డీన్ ఉండగా.. భారత బౌలర్ దీప్తి శర్మ ఆమెను మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటికీ ఛార్లీ డీన్ మంచి పట్టుదలగా విజయం కోసం పోరాడుతుంది.

ఇక ఇంగ్లాండ్ విజయానికి కేవలం 17పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఒకే ఒక వికెట్ మాత్రమే చేతిలో ఉంది. ఈ టైంలో ఛార్లీ డీన్‌ను దీప్తి శర్మ చాకచక్యంగా ఔట్ చేసింది. దీంతో చివరికి ఇంగ్లాండ్ మూడో మ్యాచ్‌లోను ఓడిపోయింది. తద్వారా సిరీస్ 3-0తేడాతో భారత్ వశమైంది. ఈ సిరీస్ అనంతరం ప్రముఖ క్రికెటర్ ఝులన్ గోస్వామి కూడా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆమెకు ఈ సిరీస్ విజయంతో భారత్ ఘనంగా వీడ్కోలు పలికింది.

నేను క్రీజు దాటి బయటకు రాను

నేను క్రీజు దాటి బయటకు రాను

డీన్ తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లో చాలా అమాయకంగా వ్యాఖ్యనించింది. ఇక మీదట క్రీజును వీడబోనని ప్రతిజ్ఞ చేసింది. డీన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ మేరకు పోస్టు చేస్తూ.. 'ఈ వేసవికి ఆసక్తికరమైన ముగింపు దక్కింది. ఇంగ్లాండ్ జెర్సీలో లార్డ్స్‌ వేదికపై ఆడడం చాలా గౌరవప్రదంగా ఉంది. ఇక నుంచి నేను క్రీజు దాటి బయటకు రాకుండా జాగ్రత్తపడతాను. లేకుంటే ఏం జరుగుతుందో తెలిసొచ్చింది.' అంటూ ఛార్లీ డీన్ క్యాప్షన్ ఇచ్చింది.

హెచ్చరించామన్న దీప్తి.. అబద్ధాలొద్దన్న నైట్

ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఛార్లీ డీన్ పదేపదే క్రీజు దాటి బయటికి వచ్చిందని, చాలా చాలాసార్లు డీన్‌ను తాము హెచ్చరించామని దీప్తి చెప్పింది. అయితే డీన్ తనకు ఎలాంటి హెచ్చరికలు ఇవ్వలేదని పేర్కొంది. ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ సైతం భారత ప్లేయర్లు అబద్ధాలు ఆడకండంటూ ఓ ప్రకటనలో అంది. ఏదేమైనా ఈ వ్యవహరాం హాట్ టాపిక్‌గా మారింది. ఇంగ్లాండ్ మాజీలు, ప్రస్తుత ప్లేయర్లు సైతం దీన్ని క్రికెట్ స్పిరిట్‌కు వ్యతిరేకం అని పేర్కొంటుండగా.. భారత అభిమానులు, మాజీ ప్లేయర్లు దీప్తి కరెక్ట్ అంటూ పేర్కొంటున్నారు.

వెక్కివెక్కి ఏడ్చిన డీన్ పాప

ఇకపోతో చివరి వన్డేలో డీన్ 47పరుగులతో మంచి ప్రతిఘటన కనబర్చింది. ఒంటి చేత్తో ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చడానికి శాయశక్తుల ప్రయత్నించింది. ఆమె ఫ్రెయా డేవిస్‌తో కలిసి చివరి వికెట్‌కు 35పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించింది. ఇక 17పరుగులు అవసరం అయిన దశలో సడెన్‌గా మన్కడింగ్ విధానంలో ఆమె రనౌట్ కావడంతో షాక్‌కు గురైంది. బోరున ఏడ్చేసింది. ఆమెను డేవిస్ ఓదార్చింది. ఇక ఈ సిరీస్లో డీన్ 54సగటుతో 108పరుగులు చేసింది. మూడు వికెట్లు కూడా తీసుకుంది.

Story first published: Tuesday, September 27, 2022, 16:05 [IST]
Other articles published on Sep 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X