రెండు మ్యాచ్‌ల నిషేదానికి గురైన చండీమల్, బంగ్లాను సైతం వదలని ఐసీసీ

Posted By:
Chandimal suspended for two matches for slow over rate

హైదరాబాద్: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అయింది లంక పరిస్థితి. భారీ స్కోరు చేసి విజయాన్ని ఆశించిన జట్టుకు అనుకోని రీతిలో ఓటమి ఎదురైంది. బంగ్లాదేశ్ ఆటగాడు ముష్‌ఫికర్ రహమాన్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడటంతో పాటు లంక బౌలర్లు పెద్దగా రాణించకపోవడంతో జట్టు ఓటమిపాలైంది. దాంతో పాటుగా లంక జట్టుకు ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. లంక జట్టు కెప్టెన్‌ను రెండు టీ20ల నిషేధం విధించింది.

శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ చండిమాల్‌పై ఈ చర్య తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మేరకు తమ అధికారిక ట్వీటర్‌లో వెల్లడించింది. రిఫరీ క్రిస్ బ్రాడ్ మాట్లాడుతూ.. నిర్ణీత సమయానికి లంక బౌలర్లు నాలుగు ఓవర్లు తక్కువ వేశారని.. దీంతో మ్యాచ్ అధిక సమయం కొనసాగిందని చెప్పారు.

అదే సమయంలో కెప్టెన్‌కు పనిష్మెంట్‌గా రెండు 2 సస్పెన్షన్ పాయింట్లు ఇస్తారు. ఇది ఓ టెస్ట్, లేక రెండు వన్డేలు, లేక రెండు టీ20ల నిషేధానికి సమానమని క్రిస్ బ్రాడ్ తెలిపారు. దీంతో ఈ నెల 12న భారత్, 16న బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20లకు దూరం కానున్నాడు. లంక ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధించారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత టైం ముగిసినా బౌలింగ్ వేస్తే.. తొలి రెండు ఓవర్లకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తారు. మిగతా ఓవర్లకు 20 శాతం చొప్పున కోత విధిస్తారు. కెప్టెన్‌ ఖాతాలో రెండు సస్పెన్షన్ పాయింట్లు చేరతాయి. ఒక టెస్టు మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల సస్పెన్షన్‌కు ఇది సమానం. దీంతో చండీమల్ తర్వాత భారత్‌తో జరగనున్న మ్యాచ్‌తోపాటు మరుసటి మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. మిగతా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధించారు.

ఏడాదిలో మరోసారి ఇదే రీతిలో శ్రీలంక స్లో ఓవర్ రేట్‌కు కారణమైతే.. లంక కెప్టెన్ ఖాతాలో 2 నుంచి 8 వరకు సస్పెన్షన్ పాయింట్లు చేరతాయి. స్లో ఓవర్ రేట్ (మైనర్) కారణంగా బంగ్లా కెప్టెన్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడగా.. మిగతా ఆటగాళ్ల ఫీజులో 10 శాతం కోత పెట్టారు.

వారితో పాటుగా వీళ్లకు కూడానూ..:
బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మమ్మదుల్లాకు సైతం మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ నిబంధన 2.5.1 ప్రకారం బంగ్లా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 10 శాతం, కెప్టెన్ మహ్మదుల్లా మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధించినట్లు రిఫరీ క్రిస్ బ్రాడ్ వివరించారు. ఏడాదిలోగా మరోసారి టీ20ల్లో స్లో ఓవర్ రేటు నమోదైతే మహ్మదుల్లా మ్యాచ్ నిషేధానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Story first published: Monday, March 12, 2018, 8:49 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి