అశ్విన్, జడేజాలపై కుల్దీప్ చాహల్‌లు ఒత్తిడి పెంచారు: గంగూలీ

Posted By:
 Chahal, Kuldeep show has put pressure on Ashwin, Jadeja: Ganguly

హైదరాబాద్: మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌లు సక్సెస్ అవడం... టీమిండియా వెటరన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఒత్తిడిలోకి నెట్టిందని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం సఫారీ గడ్డపై జరుగుతోన్న ఆరు వన్డేల సిరిస్‌లో కుల్దీప్, చాహల్‌లు అద్భుత ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే.

2019 వరల్డ్ కప్‌ని మరిచిపొండి: అశ్విన్, జడేజాలకు కష్టమే!

ఇప్పటివరకు ముగిసిన ఐదు వన్డేల్లో వీరిద్దరూ కలిసి 30 వికెట్లు తీసుకున్నారు. 2006లో స్వదేశంలో ఇంగ్లాండ్‌పై భారత స్పిన్నర్లు తీసిన 26 వికెట్ల రికార్డుని కూడా వీరు అధిగమించారు. భారత స్పిన్నర్లు 30కు పైగా వికెట్లు తీశారంటే అది 2011 వరల్డ్ కప్‌లోనే. ఈ వరల్డ్ కప్‌లో భారత స్పిన్నర్లు మొత్తం 34 వికెట్లు తీశారు.

ఈ మణికట్టు స్పిన్నర్ల సాయంతోనే గత పాతికేళ్లలో ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డుని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ 'అశ్విన్, జడేజాలపై ఒత్తిడి ఉంది. సఫారీ గడ్డపై కుల్దీప్, చాహల్‌లు రాణించడమే ఇందుకు కారణం. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఊరిస్తూ వికెట్లు తీస్తున్నారు' అని అన్నాడు.

'వీరిద్దరూ ఇలాగే రాణిస్తే ఇతరులపై కూడా ఒత్తిడి పడుతుంది. స్వదేశంలో అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. చూద్దాం ఏం జరుగుతందో' అని గంగూలీ పేర్కొన్నాడు. స్పిన్ బౌలింగ్‌కు ఏమాత్రం సహకరించిన సఫారీ పిచ్‌లపై వీరిద్దరూ వికెట్లు తీయడం నిజంగా అద్భుతమని దాదా కొనియాడాడు.

'ఒక్క రోజుకు నాతో వాలెంటైన్‌గా ఎవరైనా..' అంటూ ట్విట్టర్లో సందేశం

మణికట్టు స్పిన్నర్లు ఇలానే రాణిస్తే టీ20 సిరిస్‌లో భారత్‌ను ఓడించడం సఫారీలకు ఇంకా కష్టమవుతుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. 'నిజంగా అద్భుతం. టర్న్ అయ్యే పిచ్‌పైనే కాదు మంచి వికెట్ మీద కూడా వీరిద్దరూ వికెట్లు తీస్తున్నారు. వారిద్దరికీ ఇది శుభపరిణామం. ఈ ఇద్దరూ ఇలానే వికెట్లు తీస్తే ఏ జట్టు అయినా ఇండియాను ఓడించడం కష్టం' అని దాదా పేర్కొన్నాడు.

Story first published: Thursday, February 15, 2018, 18:18 [IST]
Other articles published on Feb 15, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి