న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రపంచకప్‌ను వాయిదా వేయడానికి చిన్నచూపు కారణం కాదు'

CEO Andrea Nelson said Women’s World Cup postponed due to lack of preparation time for players

దుబాయ్‌: వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. 2022లో ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 మధ్య ఈ మహిళల మెగా ఈవెంట్ జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రపంచకప్‌ను 2022కు వాయిదా వేయడంపై సర్వత్రా విమర్శలు కురుస్తున్నాయి. చాలా మంది క్రీడాకారిణులు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. మహిళల ప్రపంచకప్‌‌పై ఐసీసీపట్టుదలగా లేదు అని ఇంగ్లండ్‌ క్రికెట్‌ కెప్టెన్ హీథర్‌ నైట్‌ అన్నారు.

మహిళల క్రికెట్‌పై చిన్నచూపు చూడటం కారణంగానే వన్డే ప్రపంచకప్‌ను వాయిదా వేశారంటూ పలు దేశాల క్రీడాకారిణులు ఐసీసీపై విమర్శలకు దిగారు. దీంతో మెగా ఈవెంట్‌ సీఈవో ఆండ్రియా నెల్సన్‌ స్పందించారు. 'మహిళల ప్రపంచకప్ వాయిదా వేయడానికి చిన్నచూపు కారణం అస్సలు కాదు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి కారణంగా సన్నాహకానికి ఆటంకం ఏర్పడుతుంది. అదే సమయంలో ఇంకా క్వాలిఫయర్స్‌ రౌండ్‌ కూడా జరగలేదు. ఇది జూలైలో జరగాల్సిన ఉ‍న్నప్పటికీ వైరస్‌ కారణంగావాయిదా వేయక తప్పలేదు' అని ఆండ్రియా తెలిపారు.

'వైరస్‌ వ్యాప్తి కారణంగా ప్రపంచకప్ నిర్వహణ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించడం అంత సులువు కాదు. దాంతోనే 2022 వాయిదా వేశాం. టోర్నీని వాయిదా వేయడానికి న్యూజిలాండ్‌లోని భద్రతాపరమైన అంశాలు ఎంతమాత్రం కారణం కాదు. న్యూజిలాండ్‌లో కరోనా అదుపులోనే ఉంది. ప్రపంచం‌లో అతి తక్కువ కేసులు నమోదైన దేశాలలో న్యూజిలాండ్‌ ఒకటి. కరోనాతో న్యూజిలాండ్‌లో ఇ‍బ్బంది ఉండదు. న్యూజిలాండ్‌ను సాకుగా చూపడం లేదు. కానీ క్వాలిఫయర్స్‌ టోర్నీ ఇంకా జరగలేదు కాబట్టి మెగా టోర్నీని వాయిదా వేయాల్సి వచ్చింది' అని ఆండ్రియా నెల్సన్‌ చెప్పారు.

'ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెస్టిండీస్‌ వంటి ఒక దేశాన్ని తీసుకుందాం. వారు ఒక జట్టుగా కలిసి పనిచేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇష్టపడటం లేదు. అటువంటప్పుడు ఒక పెద్ద ఈవెంట్‌కు ప్రిపేర్‌ కావాలని ఎలా ఆదేశిస్తాం' అని ఈవెంట్‌ సీఈవో ఆండ్రియా నెల్సన్ వివరించారు.

IPL 2020: ఐపీఎల్ స్ఫాన్సర్‌షిప్ వేట‌లో ప‌తంజ‌లి!!IPL 2020: ఐపీఎల్ స్ఫాన్సర్‌షిప్ వేట‌లో ప‌తంజ‌లి!!

Story first published: Monday, August 10, 2020, 15:28 [IST]
Other articles published on Aug 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X