న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హెల్మెట్‌లో ఇరుకున్న బంతి: బ్యాట్స్‌మన్ వెంట పడ్డ ఫీల్డర్లు (వీడియో)

Ball Gets Trapped In Trent Boult's Helmet, Leaves Everyone In Splits || Oneindia Telugu
‘Caught and Boult’: Sri Lanka players in splits after Trent Boult hits ball into his helmet grill

హైదరాబాద్: గాలే వేదికగా న్యూజిలాండ్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గురువారం రెండో రోజు ఆటలో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో శ్రీలంక బౌలర్‌ వేసిన ఓ బంతి బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌లో చిక్కుకుంది. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. లంక స్పిన్నర్‌ లసిత్ ఎమ్బుదినియా వేసిన 82వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

రెండో రోజు ఆటలో భాగంగా లంక స్పిన్నర్‌ లసిత్ ఎమ్బుదినియా బౌలింగ్‌ చేస్తుండగా ట్రెంట్‌బౌల్ట్‌ క్రీజులో ఉన్నాడు. బౌల్ట్‌ స్వీప్‌ షాట్‌ ఆడబోగా అది ఎడ్జ్‌ తీసుకున్న వెంటనే హెల్మెట్‌లోని గ్రిల్స్‌కు తగిలి అక్కడే ఇరుక్కుపోయింది. ఒకవేళ ఆ బంతి కింద పడే సమయంలో లంక ఫీల్డర్లు క్యాచ్‌ పడితే బౌల్ట్‌ ఔటయ్యేవాడు. అదృష్టవశాత్తూ అతడికి తగలకపోవడంతో ఎలాంటి గాయం కాలేదు.

<strong>రేసులో రవిశాస్త్రి ముందంజ: హెడ్ కోచ్ సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోండి!</strong>రేసులో రవిశాస్త్రి ముందంజ: హెడ్ కోచ్ సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోండి!

బౌల్ట్‌ ఆడిన బంతి బ్యాట్‌ టాప్‌ ఎడ్జ్‌ను తీసుకున్నట్టు కనిపించినా తర్వాత ఎటుపోయిందో ఆటగాళ్లెవరికీ అర్థం కాలేదు. దీంతో ఫీల్డర్లు అయోమయంలో పడ్డారు. ఈ సమయంలో బంతి హెల్మెట్‌ గ్రిల్‌లోపల అలానే ఉండిపోవడంతో లంక క్రికెటర్లు.. బౌల్ట్‌ వెనుక పడ్డారు. ఆ క్రమంలోనే కాసేపు లంక ఫీల్డర్లను బౌల్ట్‌ ఆట పట్టించాడు. లంక క్రికెటర్లతో పాటు బౌల్ట్‌ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.

‘కాట్‌ అండ్‌ బౌల్ట్‌' అంటూ ఐసీసీ సరదాగా ట్వీట్‌

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని ఐసీసీనే స్వయంగా ‘కాట్‌ అండ్‌ బౌల్ట్‌' అంటూ సరదాగా ట్వీట్‌ చేసింది. దీంతో తమదైన శైలిలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘బౌల్ట్‌ అది యాపిల్‌ కాదు క్రికెట్‌ బంతి. నువ్వు పొరబడ్డావు. దాన్ని తినొద్దు' అంటూ ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టాడు. కాగా, ఈ ఘటన జరిగిన కాసేపటికి బౌల్ట్‌ తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

వర్షం కారణంగా తొలిరోజు ఆట ఆలస్యంగా

వర్షం కారణంగా తొలిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైన న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం గురువారం రెండో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన శ్రీలంక మరో 46 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ 83.2 ఓవర్లలో 249 పరుగుల వద్ద ముగిసింది.

నాలుగు వికెట్లు తీసిన స్పిన్నర్ సురంగా లక్మల్‌

శ్రీలంక స్పిన్నర్ సురంగా లక్మల్‌ నాలుగు వికెట్లు తీశాడు. రాస్‌టేలర్‌(86; 132 బంతుల్లో 6 ఫోర్లు) ఒక్కడే ఆఖరి వరకు పోరాడాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి నిరోశా దిక్‌వెల్లా(39; 74 బంతుల్లో ఫోర్), సురంగా లక్మల్‌ (28; 79 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు) క్రీజులో ఉన్నారు.

Story first published: Friday, August 16, 2019, 13:19 [IST]
Other articles published on Aug 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X